Share News

వెండి నగలతో జాగ్రత్త!

ABN , Publish Date - Jul 28 , 2026 | 04:55 AM

బంగారం ధర ఆకాశాన్నంటడంతో వెండి నగలకు గిరాకీ పెరిగింది. అయితే మనం కొంటున్న వెండి నగలు సురక్షితమైనవేనా? 925 సిల్వర్‌ నగలుగా ప్రచారమవుతున్న వెండి నగల్లో...

వెండి నగలతో జాగ్రత్త!

పారాహుషార్‌

బంగారం ధర ఆకాశాన్నంటడంతో వెండి నగలకు గిరాకీ పెరిగింది. అయితే మనం కొంటున్న వెండి నగలు సురక్షితమైనవేనా? 925 సిల్వర్‌ నగలుగా ప్రచారమవుతున్న వెండి నగల్లో హానికారక లోహాల పరిమాణం ఎంత?

925 సిల్వర్‌ నగల్లో నిజానికి 92.5 శాతం వెండి ఉండి తీరాలి. కానీ ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యే కొన్ని వెండి నగల్లో కేవలం పాయింట్‌ రెండు శాతం వెండి, మిగతా 92.3 శాతం కాడ్మియం ఉండే అవకాశం ఉంది. కాడ్మియం అత్యంత విషపూరితమైన భార లోహం. ఇది కాలక్రమేణా మన శరీరంలో పేరుకుపోయి, మూత్రపిండాలు, ఎముకలు, శ్వాస వ్యవస్థలను దెబ్బతీస్తుంది. యుకె, ఐరోపా దేశాల్లో వెండి నగల్లో కాడ్మియం వాడకాన్ని 0.01 శాతానికి పరిమితం చేశారు.

అయితే కాడ్మియం లోహాన్ని చేత్తో తాకినంత మాత్రాన ఆరోగ్యానికి జరిగే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ అదే లోహాన్ని అదే పనిగా నగ రూపంలో ధరించడం వల్ల, గాట్ల ద్వారా, పియర్సింగ్స్‌ ద్వారా లోహపు అవశేషాలు శరీరంలోకి చొరబడతాయి. చిన్నపిల్లలు ఈ నగలను నోట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఈ విషపూరిత లోహం శరీరంలోకి చేరుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్కువ ధరకు దొరికే ఆన్‌లైన్‌ సిల్వర్‌ జువెలరీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వెండి వస్తువులు, నగలను నమ్మకమున్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. కొనే ముందు వాటిని పరీక్షించుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 04:55 AM