Share News

నేటి అలంకారం శ్రీ సరస్వతీ దేవి

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:49 AM

శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజున శ్రీ సరస్వతీ దేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి...

నేటి అలంకారం శ్రీ సరస్వతీ దేవి

దేవీ నవరాత్రులు

(మూలా నక్షత్రం)

ఆశ్వయుజ శుద్ధ షష్టి, శుక్రవారం

శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజున శ్రీ సరస్వతీ దేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. ఈ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి అధిక ప్రాముఖ్యం ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. దుర్గాదేవి చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణించాయి. ఆసనంగా శ్వేతపద్మాన్ని అధిష్ఠించి, వీణ, దండ, కమండలాలు, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తుందని విశ్వాసం. నవరాత్రుల్లో మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా భక్తులు పరిగణించి, అమ్మను ఆరాధిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే ఈ రోజు చేసే అలంకార ప్రత్యేకత. ఆమెను కొలిస్తే విద్యార్ధులకు చదువు బాగా వస్తుందనీ, జ్ఞానజ్యోతులను ఆమె ప్రసాదిస్తుందనీ, వాక్సుద్ధిని, మంచి బుద్ధిని ఇస్తుందనీ నమ్మిక.

నైవేద్యం: దధ్యోదనం, పాయసం, ఇతర తీపిపదార్థాలు

అలంకరించే చీర రంగు: తెలుపు

అర్చించే పూలు: కలువ పూలు

పారాయణ: చెయ్యాల్సింది: సరస్వతీ స్తోత్రాలు

Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 16 , 2026 | 03:49 AM