Sandalwood Face Pack Benefits: గంధంతో ఇలా...
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:05 AM
Sandalwood Face Packs Natural Tips for Glowing and Clear Skin
చర్మాన్ని ఛాయగా మార్చి ముఖాన్ని కాంతివంతంగా మెరిపించడంలో గంధం చక్కగా పనిచేస్తుంది. అందుకోసం పాటించాల్సిన చిట్కాలు...
చిన్న గిన్నెలో చెంచా గంధం పొడి, చెంచా పాలు, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత వేళ్లతో సున్నితంగా మర్దన చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద పేరుకున్న నలుపుదనం తొలగిపోతుంది
ఒక గిన్నెలో రెండు చెంచాల గంధం పొడి, నాలుగు చెంచాల గులాబీ నీళ్లు తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పట్టించి అర గంటసేపు ఆరనివ్వాలి. తరువాత మంచినీళ్లతో కడిగేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది. చర్మ రంధ్రాలు శుభ్రమై మొటిమల బాధ తగ్గుతుంది.
గరుకుగా ఉన్న రాతిపై కొన్ని నీళ్లు చిలకరించి గంధం చెక్కతో రుద్దితే పేస్టు వస్తుంది. దీన్ని ముఖానికి పట్టిస్తే చర్మం తేమతో నిండి మృదువుగా మారుతుంది. అదనపు జిడ్డు తొలగి ముఖం సహజంగా మెరుస్తుంది. కళ్ల చుట్టూ, నుదుటి మీద ముడుతలు ఏర్పడవు.
చెంచా గంధం పొడిలో చెంచా పెరుగు లేదా కీరా రసం కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి రాసి పది నిముషాల తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మీద సెబమ్ ఉత్పత్తి తగ్గి మొటిమలు, నల్లమచ్చలు రాకుండా ఉంటాయి. ముఖంపై పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్
విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్
For More AP News And Telugu News