నేడు సద్దుల బతుకమ్మ
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:33 AM
బతుకమ్మ సంబరాల్లో తొమ్మిదవ, చివరి రోజున పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. అన్నంతో చేసిన...
వేడుక
బతుకమ్మ సంబరాల్లో తొమ్మిదవ, చివరి రోజున పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. అన్నంతో చేసిన రకరకాల పదార్థాలను ఈ రోజు నివేదిస్తారు కాబట్టి గౌరమ్మను ‘సద్దుల బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్ది తంగేడు, గునుగు పూలు, వివిధ ఇతర రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యంగా పెట్టి పూజలు జరుపుతారు. రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలుస్తారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.
నైవేద్యం: మలీద ముద్దలు (లడ్లు), చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం. నువ్వుల అన్నం, పెరుగన్నం తదితరాలు
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News