రఫ్ అండ్ టఫ్ ‘రాంపర్’
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:59 AM
వానాకాలం వీలైనంత సౌకర్యవంతమైన దుస్తులకే పెద్ద పీట వేస్తూ ఉంటాం. సాధ్యమైనంత వరకూ కురచ దుస్తులకూ, నలగని, ఇబ్బంది పెట్టని రఫ్ అండ్ టఫ్ దుస్తులకు...
ఫ్యాషన్
వానాకాలం వీలైనంత సౌకర్యవంతమైన దుస్తులకే పెద్ద పీట వేస్తూ ఉంటాం. సాధ్యమైనంత వరకూ కురచ దుస్తులకూ, నలగని, ఇబ్బంది పెట్టని రఫ్ అండ్ టఫ్ దుస్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాం.
ఆ కోవకు చెందినదే ‘రాంపర్’! స్టైలి్‌షగా,
సూపర్బ్‌గా ఉండే ఈ డ్రస్ మీద ఓ లుక్కేద్దామా?
ఇదొక్ వన్ పీస్ గార్మెంట్. టాప్, బాటమ్ విడివిడిగా ఎంచుకునే బాధ లేకుండా, టాప్‌కు షార్ట్‌ను జోడించి డిజైన్ చేసిన డ్రస్ ఇది. ఈ డ్రస్‌ను క్యాజువల్ వేర్‌లా వేసుకోవచ్చు. బీచ్‌వేర్‌గా కూడా వాడుకోవచ్చు. ఈ మిని డ్రస్ వేగంగా కదలడానికెంతో సౌకర్యంగా కూడా ఉంటుంది.
సిల్హౌట్: మ్యాచింగ్ షర్ట్, షార్ట్స్ రెండూ నడుము దగ్గర కలిసిపోయిన సింగిల్ పీస్ డ్రస్ ఇది
బాటమ్ హాఫ్: షార్ట్స్
టాప్ హాఫ్: టి షర్ట్ మొదలు, స్పాగెట్టి స్ట్రాప్స్ వరకూ, హాల్టర్ నెక్ మొదలు లాంగ్ స్లీవ్స్ వరకూ భిన్నమైన మోడల్స్ దొరుకుతాయి
రాంపర్ వర్సెస్ జంప్‌సూట్
రెండూ సౌకర్యవంతమైన వన్ పీస్ ఔట్‌ఫిట్స్ అయినప్పటికీ, బాటమ్స్ మాత్రం భిన్నంగా ఉంటాయి. రాంపర్‌లో బాటమ్ కురచగా ఉంటే, జంప్‌సూట్స్ బాటమ్ ప్యాంటులా పొడవుగా ఉంటుంది. రాంపర్స్‌ను క్యాజువల్ లేదా బీచ్‌వేర్‌గా ఎంచుకోవచ్చు. జంప్‌సూట్స్‌ను ఈవినింగ్ వేర్‌గా, ఫార్మల్ వేర్‌గా వాడుకోవచ్చు
స్టైలింగ్ ఇలా...
ఫ్యాబ్రిక్, యాక్సెసరీస్ ఆధారంగా విభిన్నమైన సందర్భాల కోసం రాంపర్స్‌ను ఎంచుకోవచ్చు. అదెలాగంటే...
పగటివేళల్లో: తేలికగా ఉండే కాటన్ లేదా లినెన్ రాంపర్స్‌ను ఫ్లాట్ శాండిల్స్ లేదా స్నీకర్స్‌తో జత చేయొచ్చు. ఈ స్టైల్ బీచ్ ట్రిప్స్‌కూ, పిక్నిక్స్‌కూ బాగుంటుంది
నైట్ ఔట్: సిల్క్ లేదా శాటిన్ రాంపర్స్‌ను బెల్ట్, స్ట్రాపీ హీల్స్‌తో మ్యాచ్ చేస్తే డిన్నర్స్, ఈవెంట్స్‌కు ధరించవచ్చు
లేయరింగ్: డెనిమ్ జాకెట్స్ లేదా టైట్స్‌తో మ్యాచ్ చేసి, స్టైలిష్ లుక్‌తో వెలిగిపోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News