పోల్కీ ఫ్యూజన్ సెట్స్
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:26 AM
సింప్లిసిటీని ఎక్కువగా ఇష్టపడే జెన్‌జీలను కూడా ఆకర్షిస్తూ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి పోల్కీ ఫ్యూజన్ సెట్స్. వింటేజ్, రెట్రో లుక్స్‌తోపాటు ఆధునికత మేళవించిన వెరైటీ డిజైన్లను యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సంప్రదాయ అన్‌కట్ డైమండ్స్‌ను మోడ్రన్ ట్రెండ్స్‌కు తగ్గట్టు డిజైన్లలో కూర్చి తయారుచేసే ప్రత్యేకమైన ఆభరణాలనే పోల్కీ ఫ్యూజన్స్‌గా పరిగణిస్తారు.
సింప్లిసిటీని ఎక్కువగా ఇష్టపడే జెన్‌జీలను కూడా ఆకర్షిస్తూ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి పోల్కీ ఫ్యూజన్ సెట్స్. వింటేజ్, రెట్రో లుక్స్‌తోపాటు ఆధునికత మేళవించిన వెరైటీ డిజైన్లను యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సంప్రదాయ అన్‌కట్ డైమండ్స్‌ను మోడ్రన్ ట్రెండ్స్‌కు తగ్గట్టు డిజైన్లలో కూర్చి తయారుచేసే ప్రత్యేకమైన ఆభరణాలనే పోల్కీ ఫ్యూజన్స్‌గా పరిగణిస్తారు. ఈ డిజైన్లలో ముత్యాలు, పచ్చలు, కెంపులు చేర్చి పొడవాటి హారాలు, చోకర్లు, నెక్ పీస్‌లు అందుబాటులోకి తెస్తున్నారు డిజైనర్లు.
పోల్కీ ఫ్యూజన్ సెట్ల తయారీ బ్రిటిష్ వారి కాలంలోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. భారతీయ రాజవంశీకులు... విక్టోరియన్, ఎడ్వర్డియన్, ఆర్ట్ డెకో శైలులను ఎక్కువగా ఇష్టపడేవారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన పోల్కీలను యూరోపియన్ డిజైనర్ల వద్దకు తీసుకెళ్లి భారతీయ శైలికి విభిన్నమైన రీతిలో ఫ్యూజన్ ఆభరణాలు చేయించుకొనేవారు. బంగారానికి బదులు ప్లాటినం, స్టెర్లింగ్ సిల్వర్, ఆక్సిడైజ్డ్ సిల్వర్‌లను ఉపయోగించి కూర్చిన డిజైన్లు పోల్కీలకు అదనపు శోభనివ్వడంతో ఈ ఫ్యూజన్ సెట్లు బాగా ప్రాచుర్యం పొందాయి.
సంప్రదాయ పోల్కీలకు ఆధునిక బ్రిలియంట్ కట్, రోజ్ కట్ వజ్రాలను జతచేసి సరికొత్త ఫ్యూజన్ డిజైన్లను ఆవిష్కరిస్తున్నారు నేటి డిజైనర్లు. ఖరీదైన రత్నాలకు బదులు మోర్గనైట్లు, టాంజనైట్లు, పింక్ సఫైర్లు, బరోక్ ముత్యాలు లాంటి పాస్టెల్ రత్నాలను ఉపయోగిస్తూ విభిన్న శైలులను అందుబాటులోకి తెస్తున్నారు. సంప్రదాయ సిల్హౌట్లను పక్కన పెట్టి జ్యామితీయ ఆకృతులు, మినిమలిస్ట్ ఓపెన్-ఎండ్ కాలర్స్, స్లీక్స్, డిటాచబుల్ కాంపోనెంట్స్‌తో మోడరన్ లుక్ తెస్తున్నారు. పోల్కీలు అనగానే ‘పెళ్లికూతురి ఆభరణాలు’ అనే భావనను పక్కకు నెట్టి వెస్ట్రన్ ఈవెనింగ్ గౌన్స్, ప్యాంట్ సూట్స్, కాక్‌టెయిల్ డ్రెస్‌లమీద చక్కగా ఒదిగే ఫ్యూజన్ సెట్లను రూపొందిస్తున్నారు. సెలబ్రిటీలనుంచి సాధారణ మహిళల వరకు అందరినీ ఇవి ఆకర్షిస్తున్నాయి. క్లోజ్డ్ ఫాయిల్ బ్యాకింగ్ కాకుండా ఓపెన్ బ్యాక్ సెట్టింగ్స్, నెక్లెస్ లేదా చోకర్‌ను విడదీసి బ్రోచ్ లేదా పెండెంట్‌లా ఉపయోగించుకునే మాడ్యులర్ డిజైన్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది.
పోల్కీ ఫ్యూజన్ సెట్లు.. అన్ని రకాల ట్రెడిషనల్, వెస్ట్రన్ డ్రెస్‌లపై చక్కగా సూటవుతాయి. హై ఫ్యాషన్ లుక్ కోసం తెల్లటి బటన్ డౌన్ షర్ట్, టెయిలర్డ్ ట్రౌజర్ మీద సన్నని పోల్కీ పెండెంట్ చెయిన్ లేదా సింగిల్ స్ట్రింగ్ చోకర్‌ను ధరించవచ్చు. బ్లేజర్ లేదా స్ట్రక్చర్డ్ జాకెట్‌పై స్లీక్ పోల్కీ ఫ్యూజన్ చోకర్ గ్రేస్‌గా కనిపిస్తుంది. ఈవెనింగ్ గౌన్లు, జంప్ సూట్లు, ధోతీ స్టయిల్ డ్రెస్‌ల మీద కాలర్ నెక్లెస్, మ్యాచింగ్ పోల్కీ స్టడ్స్ బాగుంటాయి. సింపుల్ జార్జెట్, షిఫాన్, పాస్టెల్ కలర్ సిల్క్ చీరలు, లెహంగాల మీద స్టాక్డ్ మెడాలియన్ పోల్కీ ఫ్యూజన్ సెట్లు, పాస్టెల్ బీడెడ్ ఫ్యూజన్ నెక్లె్‌సలు అందంగా నప్పుతాయి. బోహో-చిక్ లుక్ కోసం బ్లష్ పింక్ లేదా మింట్ గ్రీన్ బీడ్స్ జతచేసిన మల్టీ లేయర్డ్ పోల్కీ ఫ్యూజన్ సెట్లు పెట్టుకోవచ్చు. డ్రెస్ లేదా బ్లౌజ్‌కు వి నెక్, బోట్ నెక్, ఆఫ్ ది షోల్డర్ ఉండేలా చూసుకుంటే పోల్కీ ఫ్యూజన్స్ అందంగా కనిపిస్తాయి.
వీటినీ చదవండి:
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్' వృద్ధి: మోదీ
పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!