Paithani Silk Sarees: పైథానీ ప్రత్యేకం
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:31 AM
మల్బరీ పట్టుతో తయారయ్యే పైథానీ చీరలు అద్భుతమైన మెరుపుతో పండగ శోభను ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి సంక్రాంతి శోభతో వెలిగిపోవాలంటే పైథానీ పట్టు చీరలనే ఎంచుకోవాలి...
ఫ్యాషన్
మల్బరీ పట్టుతో తయారయ్యే పైథానీ చీరలు అద్భుతమైన మెరుపుతో పండగ శోభను ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి సంక్రాంతి శోభతో వెలిగిపోవాలంటే పైథానీ పట్టు చీరలనే ఎంచుకోవాలి ఇతర పట్టు వస్త్రాలతో పోలిస్తే పైథానీ చీరలు మరింత జారుడుగా ఉంటాయి. చీరకు రెండువైపులా కనిపించే సంక్లిష్టమైన నేత పనితనం కళ్లను కట్టిపడేస్తూ ఉంటుంది. చిలుకలు, నెమళ్లు, పూల డిజైన్లతో రూపొందే ఈ చీరల తయారీకి కొన్ని నెలల సమయం పడుతుంది. నూరు శాతం చేతి పనితనంతోనే ఈ చీరలు తయారవుతాయి. కాబట్టే పైథానీ పట్లు చీరలు లక్షల ధర పలుకుతూ ఉంటాయి.
ఈ ప్రాంతాలే ప్రసిద్ధి
మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలోని పైథానీలో ఈ చీరలు తయారవుతాయి. నాశిక్‌లోని యియోలాలో కూడా ఈ చీరలు ఎక్కవగా రూపొందుతున్నాయి. ఈ ప్రాంతం సంప్రదాయ, ఆధునిక డిజైన్ల పైథానీ చీరలకు పేరు పొందింది.
కళ్లు చెదిరే రంగులు, బంగారు, వెండి జరీలు, పవిట, అంచుల మీద విశేషమైన నెమలి, తామర మోటిఫ్స్ ఈ చీరల ప్రత్యేకతలు
అసలైన పైథానీ కోసం...
పైథానీ చీరల నకళ్లు కూడా రూపొందుతూ ఉంటాయి. కాబట్టి అసలైన పైథానీని కచ్చితంగా గుర్తు పట్టడం కోసం కొన్ని లక్షణాలను గమనించాలి. పవిట, అంచులను తిరగేసి చూస్తే, చేనేతలోని సూక్ష్మ లోపాలు కనిపించాలి. అలాగే స్వచ్ఛమైన పట్టు మృదుత్వం తెలియాలి. చీర బరువుగా ఉండాలి. కలనేత రంగులు కనిపించాలి. నెమళ్లు, తామరల సంప్రదాయ మోటిఫ్స్, పదునైన ఔట్‌లైన్స్ కనిపించాలి. నకిలీ పైథానీ చీరల దారాలు వదులుగా ఉంటాయి. అలాగే వాటి జరీ ప్లాస్టిక్‌ను పోలిన మెరుపును కలిగి ఉంటుంది.
చీరల తయారీ ఇలా...
పొడవు, మెరుపు, దృఢత్వం ఆధారంగా పట్టును విభజించి, బ్లీచ్ చేసి, రంగులు వేసి, ఆరబెడతారు
ఆ తర్వాత నేత పని మొదలవుతుంది. ఇందుకోసం చేనేత కళాకారులు చేతి మగ్గాలను ఉపయోగిస్తారు. చీరలను నేసే క్రమంలో, పవిటకూ, అంచులకూ జరీని జోడిస్తూ ఉంటారు
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News