Share News

మీకు తెలుసా!

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:42 AM

నారింజ తొక్కల్లో డీ-లిమోనేన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మురికి, దుమ్ము, జిడ్డు మరకలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. నారింజ తొక్కలతో లిక్విడ్‌ తయారుచేసి దాంతో ఇల్లు, ఫర్నిచర్‌ తుడిస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

మీకు తెలుసా!

నారింజ తొక్కల్లో డీ-లిమోనేన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మురికి, దుమ్ము, జిడ్డు మరకలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. నారింజ తొక్కలతో లిక్విడ్‌ తయారుచేసి దాంతో ఇల్లు, ఫర్నిచర్‌ తుడిస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. చిన్న గాజు సీసాలో సగానికి పైగా వైట్‌ వెనిగర్‌ను తీసుకొని, అందులో చిన్న ముక్కలుగా కట్‌చేసిన నారింజ తొక్కలు వేసి రెండు వారాలపాటు నానబెట్టాలి. ఆ తరువాత ఒక స్ర్పే బాటిల్‌లోకి వడబోస్తే... హోం క్లీనర్‌ రెడీ అవుతుంది.

డబ్బాలో నారింజ, నిమ్మ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసి, మూత బిగించి వారంపాటు ఉంచితే కంపోస్టు తయారవుతుంది. దీన్ని కుండీల్లో మట్టిలో కలిపితే నైట్రోజన్‌ చక్కగా అంది మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

ఇవీ చదవండి:

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!

Updated Date - Sep 13 , 2026 | 12:43 AM