Share News

నెట్‌ నజరానా...

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:44 AM

నెట్‌ శారీస్‌ పారదర్శకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాబట్టే ఈ రకం చీరలకు, దుస్తులకూ ఆదరణ ఎప్పటికీ తగ్గడం లేదు. నేటికీ పలు వేడుకల్లో ప్రముఖులు ఈ చీరలు...

నెట్‌ నజరానా...

ఫ్యాషన్‌

నెట్‌ శారీస్‌ పారదర్శకంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాబట్టే ఈ రకం చీరలకు, దుస్తులకూ ఆదరణ ఎప్పటికీ తగ్గడం లేదు. నేటికీ పలు వేడుకల్లో ప్రముఖులు ఈ చీరలు, డ్రస్సులతో మెరుపులు చిందిస్తూ కనిపిస్తూ ఉంటారు. అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటున్న నెట్‌ చీరలు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం!

నెట్‌ను పోలిన వస్త్రాన్ని ప్రాచీన భారతదేశంతో పాటు పాశ్చాత్య దేశాల్లోని అలంకరణల్లో కూడా ఉపయోగించారు. ఈ వస్త్రం కొన్ని దశాబ్దాలుగా వాడుకలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. మన దేశంలో మొఘలుల ముందరి కాలంలో నెట్‌ చీరలు మొదటిసారిగా ఫ్యాషన్‌లో భాగమయ్యాయి.

అదనపు హంగులతో...

సాదా నెట్‌ శారీతో పాటు అదనపు హంగులు అద్దుకున్న నెట్‌ శారీస్‌ కూడా ఆదరణ పొందుతున్నాయి. వీటిలో రఫుల్‌ నెట్‌ శారీస్‌, ఓంబ్రె నెట్‌ శారీస్‌, సాఫ్ట్‌ నెట్‌ శారీస్‌... ఇలా పలు రకాలు కూడా ఉన్నాయి. బరువు తక్కువగా ఉండే ఈ చీరలు పార్టీలు, పెళ్లిళ్లకు తగినవి. సెక్విన్స్‌, దారం, జరీ, కట్‌దానా, స్టోన్‌వర్క్‌తో కూడిన ఎంబ్రాయిడరీ ఈ చీరల ప్రత్యేకతలు. ఇవన్నీ రాత్రివేళ వేడులకు ఎంతో బాగుంటాయి.


ప్రత్యేక పనితనాలు

సెక్విన్‌: చీరంతా మెరుపులీనే సెక్విన్లతో నిండి ఉంటుంది

జరీ: మెటాలిక్‌ జరీ పనితనం కనిపిస్తుంది

ఫ్లోరల్‌: పూలను పోలిన ఆకృతులు కనిపిస్తాయి

థ్రెడ్‌వర్క్‌: దారంతో అల్లిన సంక్లిష్టమైన డిజైన్లను కలిగి ఉంటాయి

రఫుల్‌: లేయర్డ్‌ నెట్‌ చీర ఇది

సాఫ్ట్‌నెట్‌: ఈ వస్త్రం ఎంతో తేలికగా ఉంటుంది

బటర్‌ఫ్లై: ప్రత్యేకమైన నెట్‌ వస్త్రమిది

Also Read:

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 01:44 AM