Share News

ముల్తానీతో మెరిసిపోవచ్చు

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:37 AM

జిడ్డు చర్మం ఉన్నవారు, మొటిమలతో బాధపడేవారు ముల్తానీ మట్టితో సమస్యను తీర్చుకోవచ్చు....

ముల్తానీతో మెరిసిపోవచ్చు

జిడ్డు చర్మం ఉన్నవారు, మొటిమలతో బాధపడేవారు ముల్తానీ మట్టితో సమస్యను తీర్చుకోవచ్చు.

  • చెంచా ముల్తానీ మట్టిలో నాలుగు చెంచాల గులాబి నీళ్లు, చిటికెడు పసుపు కలిపి ప్యాక్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మ రంధ్రాలు శుభ్రమై మొటిమల తీవ్రత తగ్గుతుంది.

  • చిన్న గిన్నెలో అర చెంచా ముల్తానీ మట్టి, చెంచా వేప పొడి వేసి కొన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. రాత్రి పడుకునేముందు మొటిమల మీద ఈ మిశ్రమాన్ని చుక్కలుగా పెట్టాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. మచ్చలు ఏర్పడవు.

  • రెండు చెంచాల ముల్తానీ మట్టిలో నాలుగు చెంచాల పాలు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్‌ చేసి అరగంటసేపు ఉంచుకోవాలి. ఆరిన తరువాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం తేమతో నిండి బిగుతుగా మారుతుంది. సహజంగా మెరుస్తుంది.

  • పావు కప్పు పెరుగులో చెంచా ముల్తానీ మట్టి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పావుగంట తరువాత వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం ప్రకాశిస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే మొటిమల వల్ల ఏర్పడే నల్ల మచ్చలు పోతాయి.

  • చెంచా ముల్తానీ మట్టిలో చెంచా తేనె లేదా కలబంద గుజ్జు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. పది నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మానికి పోషణ అంది ముఖం తాజాగా, ఛాయగా మారుతుంది.

  • రెండు చెంచాల మాల్తానీ మట్టిలో తగినంత టమాటా రసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. పావు గంట తరువాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే చర్మం మీద పేరుకున్న మృతకణాలు, ట్యానింగ్‌ తొలగిపోతాయి.

  • గురుకుగా ఉన్న రాయిమీద గంధం చెక్కను రెండు నిమిషాలు అరగదీసి గంధాన్ని గిన్నెలోకి తీయాలి. ఇందులో పావు చెంచా ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మర్దన చేయాలి. పావుగంట తరువాత నీళ్లతో కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

Also Read:

ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే

అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2026 | 01:37 AM