Share News

Latest Makeup Trends for Women: ట్రెండ్‌కు తగ్గట్టు...

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:11 AM

ఫ్యాషన్‌ పోకడల మాదిరిగా మేకప్‌ పోకడలు కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ట్రెండ్‌ తగ్గట్టు తగిన మేక్‌పను ఎంచుకుంటూ ఉండాలి....

Latest Makeup Trends for Women: ట్రెండ్‌కు తగ్గట్టు...

మేకప్‌

ఫ్యాషన్‌ పోకడల మాదిరిగా మేకప్‌ పోకడలు కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ట్రెండ్‌ తగ్గట్టు తగిన మేక్‌పను ఎంచుకుంటూ ఉండాలి.

లిప్‌ లైనర్‌తో: లిప్‌స్టిక్‌ బదులుగా, లైనర్‌ మీద దృష్టిని పెంచే రోజులొచ్చాయి. లైనర్‌తో పెదవులను అంచులను తీర్చిదిద్ది, పలుచగా లిప్‌స్టిక్‌ అద్దుకోవడమే తాజా పోకడ. అయితే ఎంచుకునే లిప్‌ లైనర్‌ వీలైనంత ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. పెదవుల అంచుల దగ్గరి నుంచి మొదలుపెట్టి, మధ్య వరకూ లైనర్‌ గీసుకుని, లేత గులాబీ, పీచ్‌ రంగు లిప్‌స్కిట్స్‌ పెదవులకు పలుచగా అద్దుకోవాలి

గోళ్లకు శింగారం: నెయిల్‌ ఆర్ట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. డ్రస్‌తో మ్యాచ్‌ అయ్యే రంగులతో పాటు, డిజైన్‌ను కూడా మ్యాచ్‌ చేసుకోవడం తాజా పోకడ. ఇందుకోసం క్రిస్టల్స్‌, బీడ్స్‌, చమ్కీలను ఎంచుకోవచ్చు

చమ్కీల తళుకులు: ఐషాడో, లిప్‌ కలర్‌, బ్లష్‌.. వీటన్నిట్లో మెరుపు కలిసి ఉంటే అదొక అదనపు హంగు అవుతుంది. పార్టీలు, పెళ్ళిళ్లు లాంటి వేడుకల్లో, ఈవెంట్లలో ఇలాంటి మేక్‌పను ఎంచుకుంటే మెరుపులు మెరపించవచ్చు. ఈ ట్రెండ్‌కు ఆదరణ ఎప్పటికీ ఉండేదే!

విల్లు లాంటి కనుబొమలు: మన కనుబొమలను అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం మేకప్‌ నిపుణుల సలహా పాటించడం తప్పనిసరి. ఏ ముఖాకృతికి ఎలాంటి కనుబొమలు నప్పుతాయో తెలుసుకుని, నిపుణుల సూచనల మేరకు కనుబొమలను విల్లుల్లా తీర్చిదిద్దుకుని నలుగురినీ ఆకట్టుకోవచ్చు. అలాగే కనుబొమలను దిద్దుకోవడం కోసం నలుపు రంగుకు బదులుగా ముదురు గోఽధుమ రంగు ఐబ్రో పెన్సిల్‌ ఎంచుకుంటే సహజత్వం ప్రతిబింబిస్తుంది

ఐషాడో అదిరేలా: డ్రస్‌ రంగుకు మ్యాచ్‌ అయ్యే ఐషాడోలను ఎంచుకునే రోజులు పోయాయి. ప్రత్యేకంగా కనిపించేలా చేసే ‘పేల్‌ బ్లూ పెర్ల్‌’, ‘స్మోకీ నేవీ’ రంగులు వాడుకలోకొచ్చాయి. వీటిలో దేన్ని ఎంచుకున్నా, కనురెప్పలు ఎబ్బెట్టుగా కనిపించకుండా ఐలైనర్‌లో కలిసిపోయేలా ఐషాడోను అప్లై చేసుకోవాలి. కనురెప్పలు దించినా, లేపినా కంటి అందం చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి...

వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 04:11 AM