చాంద్‌బాలీల చమక్కులు..!
ABN , Publish Date - Aug 16 , 2026 | 04:58 AM
మహిళలంతా ఇష్టపడే చాంద్‌బాలీల్లో లేటెస్ట్ డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి. పోల్కీలు, ముత్యాలు, బీడ్స్, రత్నాలు కూర్చినవాటిని అమ్మాయిలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు....
మహిళలంతా ఇష్టపడే చాంద్‌బాలీల్లో లేటెస్ట్ డిజైన్లు అందుబాటులోకి వచ్చేశాయి. పోల్కీలు, ముత్యాలు, బీడ్స్, రత్నాలు కూర్చినవాటిని అమ్మాయిలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
లేయర్స్‌తో...
లైట్ వెయిట్‌తో సౌకర్యంవంతంగా ఉండే డబుల్ లేయర్ చాంద్‌బాలీలు అన్ని రకాల డ్రెస్‌ల మీద చక్కగా సూటవుతాయి. ఇవి బంగారు లేదా ముత్యాల డ్రాప్స్‌తో గ్రాండ్‌గా కనిపిస్తాయి. వీటిని రోజువారీ పెట్టుకోవచ్చు.
స్పైక్స్‌తో...
రెండు వరుసల స్పైక్స్‌కు బంగారు గుండ్లు లేదా మువ్వలు జతచేసిన చాంద్‌బాలీలను మహిళలు బాగా ఆదరిస్తున్నారు. అక్కడక్కడా ఎనామెల్ పెయింట్ లేదా రత్నాలు జోడించిన డిజైన్లకు దేశ విదేశాల్లో అత్యధికంగా డిమాండ్ ఉంటోంది.
ముత్యాలతో...
తెల్లటి ముత్యాలతో డిజైన్ చేసిన నెలవంక డిజైన్లను టీనేజ్ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. విభిన్న ఆకారాల్లో ఉండే చిన్న చిన్న ముత్యాలను గుత్తులుగా ఏర్చికూర్చిన చాంద్‌బాలీలు.. పట్టుచీరలు, లెహంగాలు లాంటి సంప్రదాయ దుస్తుల మీద ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పెద్ద ముత్యం వేలాడుతూ ఉండే సింపుల్ డిజైన్లు రోజువారీ పెట్టుకోవడానికి బాగుంటాయి.
పోల్కీలతో...
నెమలి, హంస, పూల డిజైన్లతో రూపొందించిన చాంద్‌బాలీల మీద రకరకాల కుందనాలు, అమెరికన్ డైమండ్స్ పొదిగి గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇవి లైట్ వెయిట్‌లో కూడా అందుబాటులో ఉంటున్నాయి.
స్టడ్స్‌తో...
గుండ్రని దిద్దులకు అర్థచంద్రాకారపు చాంద్‌బాలీలను అమర్చి వాటికి కెంపులు, పచ్చలు, నీలాలు జతచేసిన డిజైన్లను మధ్య వయసు మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి సింపుల్‌గా ఉంటూనే గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాయి. వీటిలో గోల్డ్ ప్లేటెడ్ ట్రెడిషనల్ డిజైన్లు, ఆక్సిడైజ్డ్ సిల్వర్ డిజైన్లు... బడ్జెట్‌లోనే దొరుకుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News