Kantakari Ayurvedic Uses: ఊపిరితిత్తులకు రక్ష కంటకారి
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:26 AM
మన చుట్టూ ఉండే మొక్కల్లోనే అపారమైన వైద్య రహస్యాలు దాగి ఉన్నాయనే విషయాన్ని నిరూపించే మొక్క కంటకారి. వంకాయ, టమోటో కుటుంబానికి చెందిన ఈ మొక్క నేలబారున...
భోజన కుతూహలం
మన చుట్టూ ఉండే మొక్కల్లోనే అపారమైన వైద్య రహస్యాలు దాగి ఉన్నాయనే విషయాన్ని నిరూపించే మొక్క కంటకారి. వంకాయ, టమోటో కుటుంబానికి చెందిన ఈ మొక్క నేలబారున పెరిగే చిన్న పొద! కంటకారికి ఆయుర్వేదంలో ఉన్న పేర్లు దాని గుణాలను ప్రతిబింబిస్తాయి. ఆ పేర్లు..
క్షుద్రా: చిన్న పొదగా నేలపై వ్యాపించి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది.
వ్యాఘ్రీ: ఈ మొక్కను వాడితే సింహంలా (వ్యాఘ్రం) గర్జించే గొంతు వస్తుంది.
రాష్ట్రికా: ఎక్కడైనా, ఏ నేలనైనా పెరిగే సామర్థ్యం దీని సొంతం.
ధవని: నేలపై అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.
ద్రవణి: కఠినమైన కఫాన్ని కరిగించి (ద్రవించి) బయటకు పంపుతుంది.
కంటకారి: గొంతులో ముల్లులా గుచ్చుకునే కంటక వ్యాధిని హరిస్తుంది.
ఉపయోగాలు...
వాత, కఫ దోషాలను అదుపు చేయడంలో మేటి. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడం దీని ప్రధాన విధి. దీర్ఘకాలిక వ్యాధులైన బ్రోంకైటిస్, ఆస్తమా, ఎలర్జీ, దగ్గులతో బాధపడేవారు ఈ మొక్కను సమూలంగా (వేర్లతో సహా) ఎండ బెట్టి టీలా కాచుకుని తాగితే అద్భుత ఫలితాలు వస్తాయి.
వైరస్ వల్ల వచ్చే జ్వరాలు, గొంతు నొప్పులకు ఇది దివ్యౌషధం. కేవలం దగ్గునే కాదు, శరీరంలోని అంతర్గత అవయవాలలో కలిగే వాపులను తగ్గించడంలోనూ ఇది మేటి. లివర్, స్ప్లీన్ (ప్లీహం), గుండె, కిడ్నీలు మరియు ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే
వాపులను తగ్గించి, ఆ అవయవాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటి్‌సలో కలిగే వాపుల్ని కూడా బాగా తగ్గిస్తుంది.
నడుము నొప్పి, మడమ శూల, మైగ్రేన్ తలనొప్పులను ఇది తగ్గిస్తుంది.
ఇది ఆకలిని పెంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. మూత్రం బాగా అయ్యేలా చేస్తుంది.
పేనుకొరుకుడు సమస్య ఉన్నచోట దీని పండ్ల రసాన్ని తేనెతో కలిపి రాస్తే జుట్టు తిరిగి మొలుస్తుంది.
చర్మ వ్యాధులు, దురదలు ఉన్నవారు దీని కషాయం తాగడం వల్ల రక్తం శుద్ధి అయ్యి సమస్యలు త్వరగా తగ్గుతాయి.
గంగరాజు అరుణాదేవి
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
Read Latest AP News And Telugu News