స్ట్రెచ్ మార్క్స్ పోయేదెలా
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:54 AM
బరువు పెరిగి తగ్గినప్పుడు, గర్భధారణ తరువాత చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి. ఇవి ఎక్కువగా కాళ్లు, భుజాలు, కడుపు, నడుము భాగాల్లో కనిపిస్తుంటాయి....
బరువు పెరిగి తగ్గినప్పుడు, గర్భధారణ తరువాత చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి. ఇవి ఎక్కువగా కాళ్లు, భుజాలు, కడుపు, నడుము భాగాల్లో కనిపిస్తుంటాయి. వీటిని చిన్న చిట్కాలతో పోగొట్టుకోవచ్చు.
రాత్రి పడుకునేముందు గోరువెచ్చగా వేడి చేసిన ఆముదాన్ని స్ట్రెచ్ మార్క్స్ మీద రాస్తూ సున్నితంగా మర్దన చేయాలి. ఉదయాన్నే వేడి నీళ్లతో స్నానం చేయాలి. ఇలా మూడు నెలలపాటు చేస్తూ ఉంటే క్రమంగా స్ట్రెచ్ మార్క్స్ మాయమవుతాయి.
ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల కలబంద జెల్, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్, రెండు ఇ విటమిన్ క్యాప్సూల్స్‌లో ఉండే ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ స్ట్రెచ్ మార్క్స్ మీద మర్దన చేయాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కోకో బటర్, టీ ట్రీ ఆయిల్, జోజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనె రాస్తూ ఉన్నా ప్రయోజనం ఉంటుంది.
రెండు చెంచాల బాదం నూనెలో అర చెంచా చక్కెర కలిపి స్క్రబ్‌లా వాడితే రక్తప్రసరణ జరిగి స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి.
రెండు చెంచాల బంగాళదుంప రసంలో చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని రాసినా ఫలితం కనిపిస్తుంది.
తరచూ మంచినీళ్లు తాగుతూ చర్మం తేమగా ఉండేలా చూసుకోవాలి. చర్మానికి మేలు చేసే ఎ, సి, ఇ విటమిన్లు అధికంగా ఉండే పండ్లను తినాలి. వీటివల్ల పోషణ అంది చర్మం యథాస్థితికి వస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News