Share News

చిన్న గదిని విశాలంగా మార్చేయండిలా

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:31 AM

ఇల్లు చిన్నదైనా చూసేవారికి పెద్దగా కనిపించాలంటే ఈ ట్రిక్స్‌ ఫాలో అవండి....

చిన్న గదిని విశాలంగా మార్చేయండిలా

ఇల్లు చిన్నదైనా చూసేవారికి పెద్దగా కనిపించాలంటే ఈ ట్రిక్స్‌ ఫాలో అవండి.

లేత రంగుల మాయాజాలం: గది గోడలకు వైట్‌, క్రీమ్‌ లేదా లైట్‌బ్లూ వంటి లేత రంగులు వాడండి. ఇవి వెలుతురును ఎక్కువగా ప్రతిబింబించి గది పెద్దదిగా కనిపించేలా చేస్తాయి.

కర్టెన్ల అమరిక: కిటికీ సైజు ఎంత ఉన్నా కర్టెన్‌ రాడ్‌ను మాత్రం పైకప్పుకు దగ్గరగా అమర్చండి. కరెన్లు కింద నేల వరకు వేలాడుతుంటే గది ఎత్తు ఎక్కువగా కనిపిస్తుంది.

మల్టీపర్పస్‌ ఫర్నిచర్‌: కింద స్టోరేజ్‌ ఉన్న బెడ్స్‌ లేదా సోఫా కమ్‌ బెడ్స్‌ వాడటం వల్ల వీలుగా ఉండటమే కాకుండా గదిలో ఖాళీ స్థలం ఎక్కువగా మిగులుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 04:32 AM