Share News

పాత వస్తువులకు కొత్త కళ

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:34 AM

మీ ఇంట్లో వాడని పాత వస్తువులు ఉన్నాయా? వాటిని పారేయకండి. ఇలా చేస్తే అవి కొత వాటిలా కళకళలాడిపోతాయి....

పాత వస్తువులకు కొత్త కళ

మీ ఇంట్లో వాడని పాత వస్తువులు ఉన్నాయా? వాటిని పారేయకండి. ఇలా చేస్తే అవి కొత వాటిలా కళకళలాడిపోతాయి.

గాజుసీసాలు: ఖాళీగా ఉన్న జామ్‌ లేదా సాస్‌ గాజు సీసాలను శుభ్రం చేసి వాటికి రంగురంగుల దారాలు చుట్టండి. లేదంటే, అక్రిలిక్‌ పెయింట్స్‌ వేయండి. ఇవి అద్భుతమైన ఫ్లవర్‌వాజులుగా మారిపోతాయి.

పాత కప్పులు: హ్యాండిల్‌ విరిగిపోయిన, లేదా వాడకుండా పక్కనపెట్టిన సెరామిక్‌ కప్పుల్లో చిన్నచిన్న సక్యులెంట్‌ మొక్కలను నాటండి. వీటిని మీ వర్క్‌ టేబుల్‌ లేదా కిటికీ దగ్గర పెడితే ఆ ప్రదేశమే మారిపోతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 04:34 AM