Share News

పాత సోఫా కొత్తగా..

ABN , Publish Date - May 16 , 2026 | 01:22 AM

వాడకం మీద సోఫా పాతబడినట్లు కనిపిస్తుంటే చిన్న చిట్కాలు పాటించి దాన్ని కొత్తగా మార్చేయవచ్చు. ఎలాగంటే...

పాత సోఫా కొత్తగా..

వాడకం మీద సోఫా పాతబడినట్లు కనిపిస్తుంటే చిన్న చిట్కాలు పాటించి దాన్ని కొత్తగా మార్చేయవచ్చు. ఎలాగంటే...

  • ఆకర్షణీయమైన రంగు, డిజైన్లు ఉన్న స్లిప్‌ కవర్‌ వేస్తే సోఫా కొత్తగా కనిపిస్తుంది. బిగుతుగా సోఫాను అంటిపెట్టుకుని ఉండేవి, వదులుగా ఉంటూ సోఫాకు అందమైన ఆకారాన్ని ఇచ్చేవి, ఎప్పటికప్పుడు తీసి వుతకడానికి వీలుగా ఉండేవి... ఇలా ఎన్నో రకాల స్లిప్‌ కవర్స్‌ ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.

  • పాతకాలపు సోఫాలకు లావుపాటి ప్లాస్టిక్‌ లేదా చెక్క దిమ్మలవంటి కాళ్లుంటాయి. వీటిని సులువుగా విడదీయవచ్చు. వాటి స్థానంలో నాజూకైన లోహపు కాళ్లను అమరిస్తే సోఫా చాలా ఖరీదైనదిగా కనిపిస్తుంది.

  • సోఫాలో ఇప్పటి వరకూ ఉన్న చిన్న దిండ్లను మార్చేసి కొత్త మోడల్‌ పిల్లోలను తెచ్చి పెడితే బాగుంటుంది. కొన్ని పెద్ద పిల్లోలను కూడా అమరిస్తే సోఫా బ్యాక్‌ రెస్ట్‌ లోపాలు కనిపించకుండా ఉంటాయి. వెల్వెట్‌, ఉన్ని కవర్లతోపాటు మంచి ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న కవర్లను దిండ్లకు వేస్తే సోఫాతోపాటు హాల్‌ లేదా లివింగ్‌ రూమ్‌ అందం ఇనుమడిస్తుంది.

  • బ్యాక్‌ రెస్ట్‌ ప్రదేశంలో ఏవైనా చిరుగులు ఉన్నా, మరకలతో పాతబడినట్లు ఉన్నా వాటిపై అల్లిక దుప్పటి లేదా చక్కని ఆకారంలో కటింగ్‌ చేసిన వెల్వెట్‌ క్లాత్‌ను వేస్తే సోఫా స్టయిలి్‌షగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బ్యాక్‌ రెస్ట్‌ చదునుగా ఉన్నట్లయితే దానిమీద పెద్ద సైజు బటన్స్‌ను కుట్టిస్తే సోఫా లుక్‌ పూర్తిగా మారిపోతుంది.

  • సీటింగ్‌ పిల్లోలు అణిగినట్లుంటే వాటిని పాలి ఫిల్‌ లేదా క్విల్ట్‌ బ్యాటింగ్‌తో నింపితే సరిపోతుంది. ఈ పిల్లోల కింద ప్లైవుడ్‌ పలకను అమరిస్తే కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

  • ఫ్యాబ్రిక్‌ షేవర్‌ సహాయంతో షేవ్‌ చేస్తే సోఫా మీద ఏర్పడిన నూగు పూర్తిగా తొలగి నున్నగా మెరుస్తుంది.

  • సోఫా అంచులకు బంగారు రంగు గుండ్లు లేదా చిన్న సైజు గుండీలతో కూడిన పట్టీలను అతికిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 16 , 2026 | 01:22 AM