Share News

ఇల్లు చల్లగా ఉండాలంటే...

ABN , Publish Date - Apr 09 , 2026 | 02:50 AM

వేసవికాలంలో మధ్యాహ్నానికల్లా ఇల్లు బాగా వేడెక్కి ఏసీ లేదా కూలర్‌ వేసుకోనిదే ఉండలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అలాకాకుండా ఇంటిని చల్లగా ఉంచే చిట్కాలివే...

ఇల్లు చల్లగా ఉండాలంటే...

వేసవికాలంలో మధ్యాహ్నానికల్లా ఇల్లు బాగా వేడెక్కి ఏసీ లేదా కూలర్‌ వేసుకోనిదే ఉండలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అలాకాకుండా ఇంటిని చల్లగా ఉంచే చిట్కాలివే...

  • పగటిపూట ఎండ, వేడిగాలి ఇంట్లోకి రాకుండా కిటికీలకు, గుమ్మానికి కర్టెన్లు వేయాలి. తెలుపు లేదా లేత రంగుల్లో ఉన్న కాటన్‌ కర్టెన్లు వేస్తే ఇల్లు త్వరగా వేడెక్కదు.

  • కాటన్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు, సోఫా కవర్లు, టేబుల్‌ క్లాత్‌లను ఎంపిక చేసుకుంటే మంచిది. కాటన్‌.. తేలికగా గాలి ప్రసరించడానికి తోడ్పడుతుంది.

  • సూర్యాస్తమయం తరువాత లేదా బాగా చీకటి పడిన తరువాత ప్రతి గదిలో కిటికీ తలుపులు తెరవాలి. దీనివల్ల బయటి నుంచి చల్లటి గాలి లోపలికి వీచి ఇల్లు చల్లగా మారుతుంది.

  • హాల్లో ఫ్యాన్‌ వేసిన తరువాత వెడల్పాటి గిన్నెలో కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ వేసి ఓ మూలగా ఉంచితే ఇల్లు చల్లగా ఉంటుంది.

  • వంటగదిలో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ వేసి ఉంచితే ఇంట్లోని వేడిగాలి బయటికి వెళుతుంది.

  • సాధారణ బల్బులకు బదులు ఎల్‌ఈడీ బల్బులు వాడితే గది వేడెక్కకుండా ఉంటుంది.

  • ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో తుడిస్తే ఇల్లు చల్లగా ఉంటుంది. అలాగే సాయంత్రం కాగానే మిద్దెపైన, ఇంటి ముంగిట చల్లటి నీళ్లు చల్లితే ఫలితం ఉంటుంది.

  • ప్రతి గదిలో ఒకటి లేదా రెండు ఇండోర్‌ ప్లాంట్‌ కుండీలను ఏర్పాటు చేసుకుంటే ఇల్లు వేడెక్కదు. బాల్కనీల్లో, ఇంటి ఆవరణలో చిన్న చిన్న మొక్కలు పెంచుతూ ఉంటే పరిసరాలు చల్లదనంతో నిండుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు

For More AP News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 02:51 AM