Heart Healthy Foods: ఇవి తింటే గుండెజబ్బులు దూరం
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:09 AM
ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు బాగా పెరిగిపోతున్నాయి. గుండెకు మేలు చేసే ఆహారం తినటం వల్ల ఈ జబ్బులు రాకుండా నివారించవచ్చని పౌష్టికాహార నిపుణులు...
ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు బాగా పెరిగిపోతున్నాయి. గుండెకు మేలు చేసే ఆహారం తినటం వల్ల ఈ జబ్బులు రాకుండా నివారించవచ్చని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు..
బీట్‌రూట్ : బీట్‌రూట్‌లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి కూడా ఉండదు. అందువల్ల ప్రతి రోజు మనం తినే ఆహారంలో బీట్‌రూట్‌ను ఏదో ఒక విధంగా జత చేరిస్తే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
వాట్‌నట్స్ : వాల్‌నట్స్‌లో ఆల్ఫా లానోలినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించటంలో ఉపయోగపడుతుంది.
చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటే రక్తనాళాలు పూడుకుపోతాయి. దీని వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు. గుండె జబ్బులు వస్తాయి. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించటం ద్వారా వాల్‌నట్స్ మనకు గుండె జబ్బులు రాకుండా పరోక్షంగా ఉపకరిస్తాయి.
మైక్రోగ్రీన్స్ : మైక్రోగ్రీన్స్‌లో సల్ఫోరాఫిన్, ఐసోతిసైనేట్స్ వంటి వంటి కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి రక్తకణాలలోని వాపును తగ్గిస్తాయి. దీని వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అప్పుడు గుండె జబ్బులు రావు. ప్రతి రోజూ మన ఆహారంలో మైక్రోగ్రీన్స్‌ను ఏదో ఒక రకంగా తీసుకోవటం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
చేపలు : మన ఆరోగ్యానికి హాని చేసే ట్రైగ్లిజరైట్స్‌ను తగ్గించటంలో చేపలు ఉపకరిస్తాయి. అంతే కాకుండా చేపలను క్రమం తప్పకుండా తింటే కండరాలలో వాపులు కూడా తగ్గుతాయి.
డార్క్ చాక్‌లెట్ : చాక్‌లెట్‌లో ఉండే కోకా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. కోకా వల్ల మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల రక్తనాళాలు పూడుకుపోవు. ప్రతి రోజు కొద్దిగా డార్క్ చాక్‌లెట్ తినటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయని పౌష్టికాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News