గుండె గట్టిదే!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:03 AM
గుండెపోటుకు గురైన తర్వాత గుండె స్వయంగా కండర కణాలను పెంచుకోగలుగుతుందని తాజాగా...
గుండెపోటుకు గురైన తర్వాత గుండె స్వయంగా కండర కణాలను పెంచుకోగలుగుతుందని తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భవిష్యత్తులో గుండె వైఫల్యం తదనంతర చికిత్సలను సులభతరం చేయడంలో ఈ తాజా ఆవిష్కరణ దోహదపడబోతోంది. మరిన్ని వివరాలు....
సాధారణంగా గుండెపోటు తర్వాత గుండెలోని కొంత భాగం మచ్చలా మారిపోతుంది. అదే సమయంలో ఆ ప్రదేశంలో కొత్త కణాలు కూడా ఉత్పత్తి అవుతున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుండెపోటుతో గుండె కణాలు చనిపోతాయి కాబట్టి గుండెలోని ఆ ప్రాంతాన్ని తిరిగి మరమ్మత్తు చేయడానికి వీలు పడదనీ, బలహీనపడిన గుండె తక్కువ సామర్థ్యంతో మాత్రమే అవయవాలకు రక్తాన్ని పంపిణీ చేయగలుగుతుందనీ భావించారు. అయితే గుండెపోటుకు గురైన తర్వాత, గుండె కొత్త కండర కణాలను ఉత్పత్తి చేసుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం గుండె వైఫల్యం కారణంగా బైపాస్ సర్జరీ చేయించుకునే రోగుల నుంచి గుండె కణజాలాన్ని సేకరించి పరిశీలించారు. అలా పరిశీలించినప్పుడు, గుండెలో మైటోసిస్ అనే కణ విభజన, పునరుత్పత్తి ప్రక్రియ చోటు చేసుకోడాన్ని పరిశోధకులు గమనించారు. ఈ తాజా ఆవిష్కరణ వల్ల, గుండె వైఫల్య నష్టాన్ని చక్కదిద్దే కొత్త గుండె కణాల ఉత్పత్తి సాధ్యపడుతుందనీ, గుండె వైఫల్యాన్ని రివర్స్ చేసే కొత్త గుండె కణాల ఉత్పత్తే తమ ప్రధాన లక్ష్యమనీ రాయల్ ఆల్ర్ఫెడ్ ఆస్పత్రికి చెందిన గుండె వైఫల్య నిపుణుడైన, ప్రొఫెసర్ షాన్ లాల్ పేర్కొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News