కార్డియాలజీ ప్రాక్టీస్ విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎలా మార్చవచ్చు
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:49 AM
గుండె జబ్బులకు సంబంధించిన కార్డియోవాస్క్యులర్ డేటాను సేకరించడం, విశ్లేషించడం, కాలక్రమంలో రోగి పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడంలో ఏఐ పాత్ర క్రమంగా పెరుగుతోంది. దీని అర్థం, ఒక...
వరల్డ్ హార్ట్ డే
కార్డియాలజీ ప్రాక్టీస్ విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎలా మార్చవచ్చు?
గుండె జబ్బులకు సంబంధించిన కార్డియోవాస్క్యులర్ డేటాను సేకరించడం, విశ్లేషించడం, కాలక్రమంలో రోగి పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడంలో ఏఐ పాత్ర క్రమంగా పెరుగుతోంది. దీని అర్థం, ఒక కార్డియాలజి్‌స్టగా మీ రోజువారీ క్లినికల్ పనులన్నీ ఏఐ భర్తీ చేస్తుందని కాదు. ఏయే పనులను సాఫ్ట్‌వేర్ సహాయంతో సులువుగా చేసుకోవచ్చో నిర్ణయించుకోవడమే ఇక్కడ అసలైన మార్పు.
ఈసీజీ విషయంలో ఏఐ ఎలా సహాయపడుతుంది?
ఇప్పటికే ఏఐ ఉపయోగం కనిపిస్తున్న రంగాల్లో ఈసీజీ ఇంటర్‌ప్రిటేషన్ కూడా ఒకటి. ఈసీజీలను పరిశీలించడంలో ఏఐ ఇప్పటికే ఎంతో ముందంజలో ఉంది. హార్ట్ బీట్‌లో తేడాలు, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కండక్షన్ అబ్‌నార్మాలిటీస్, ఇతర రిథమ్ మార్పులను గుర్తించగలదు. కార్డియాలజిస్టులు బిజీగా ఉండే క్లినికల్ రోజుల్లో, వెంటనే దృష్టికి రాని కొన్ని ప్యాటరన్స్‌ను కూడా ఇవి గుర్తించగలవు. ఇక స్మార్ట్ వాచ్‌లు, అంబ్యులేటరీ మానిటర్స్, ఇతర వేరబుల్స్ ద్వారా, రోగి హాస్పిటల్ బయట ఉన్న సమయంలో కూడా, తన గుండె రిథమ్‌కు సంబంధించిన డేటా నిరంతరం అందుబాటులోకి వస్తోంది.
ఎకోకార్డియోగ్రఫీని మరింత కచ్చితంగా, ఒకే విధంగా చేయడంలో ఏఐ
ఎకోకార్డియోగ్రఫీ కూడా క్రమంగా ఆటోమేషన్ వైపు వెళ్తోంది. ఎకో రిపోర్టులలో కొలతలు తీసుకోవడం ఇప్పుడు మరింత ఆటోమేటిక్ అయింది. ఎజెక్షన్, ఫ్రాక్షన్, ఛేంబర్ వాల్యూమ్స్, స్ట్రెయిన్, డాప్లర్ పారామీటర్స్ వంటి వాటికి సాఫ్ట్‌వేర్ సహాయం చేయగలదు. దీనివల్ల పదేపదే మాన్యువల్‌గా కొలిచే శ్రమ తప్పుతుంది. వివిధ ఎకో స్టడీస్ మధ్య కొలతల్లో ఉండే తేడాలను కూడా తగ్గించి, మరింత కన్సిస్టెన్సీతో ఫలితాల్లో స్పష్టత వస్తుంది. అయితే, ఆ కొలతలు రోగి పరిస్థితికి అనుగుణంగా, క్లినికల్‌గా సరైనవేనా? కాదా?? అనేది నిర్ణయించాల్సిన బాధ్యత మాత్రం కార్డియాలజి్‌స్టదే.
కార్డియాక్ సీటీ, ఎంఆర్‌ఐ కూడా ఇదే దిశగా ముందుకు వెళ్తున్నాయి. ఇమేజ్ సెగ్మెంటేషన్, కరోనరీ కాల్షియం స్కోర్, రక్త నాళాల్లో పూడికలని గుర్తించడంలో, అఐ సహాయపడుతుంది. క్లినికల్‌గా ముఖ్యమైన కరోనరీ డిసీజ్‌కు సంబంధించిన లక్షణాలను గుర్తించేలా కొన్ని అఐ సిస్టమ్స్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
ముఖ్యంగా ఒకేసారి పెద్ద సంఖ్యలో స్కాన్లు చేయాల్సి వచ్చినప్పుడు, క్లిష్టమైన ఇమేజింగ్ డేటాను ప్రాసెస్ చేయడం ఈ టూల్స్ వల్ల మరింత సులభం కావచ్చు.
ఏఐ చేయలేని పనులు
సాఫ్ట్‌వేర్ ఎక్కువగా కొలతలు తీయడం, స్ర్కీనింగ్ చేయడం, రిపోర్టులు రాయడం వంటి డాక్యుమెంటేషన్ పనులను చూసుకుంటే, మీకు రోగితో నేరుగా మాట్లాడేందుకు, అతని మెడికల్ హిస్టరీ తెలుసుకునేందుకు, పరీక్ష చేయడానికి, సమయం దొరుకుతుంది. దాంతోపాటు చికిత్స గురించి వివరించడానికి, ఏ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి? అందులో ఉండే రిస్క్‌లు ఏమిటి? అని రోగికి అర్థమయ్యేలా వివరించి, వివిధ రిస్క్‌లను బేరీజు వేసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మరింత సమయం దొరుకుతుంది.
కాంప్లెక్స్ కరోనరీ డిసీజ్ ఉన్న రోగికి ఏ చికిత్స సరైనది? ఏదైనా ఇంటర్వెన్షన్ అవసరమా? దానికి ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఒక్కో ఆప్షన్ ఆ రోగి పరిస్థితికి ఎలా సరిపోతుంది? అనే విషయాలను వివరించి నిర్ణయం తీసుకోవడంలో మాత్రం కార్డియాలజిస్ట్ పాత్ర ఎంతో కీలకం!
మీ ప్రాక్టీ్‌సలో ఏఐని ఎక్కడ, ఎలా ప్రారంభించవచ్చు?
ప్రాక్టికల్‌గా చూస్తే, ముందుగా కొన్ని చిన్న చిన్న పనులతో ఏఐని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఏఐ ఆధారిత ఈసీజీ విశ్లేషణ, ఇమేజింగ్ కొలతలు, క్లినికల్ డాక్యుమెంటేషన్, హై రిస్క్ ఉన్న కొంతమంది రోగులను పర్యవేక్షించడం వంటి వాటిల్లో దీనిని వాడి చూడొచ్చు.
ఆ తర్వాత ఈ టెక్నాలజీ నిజంగా మీ సమయాన్ని ఎంత ఆదా చేస్తోంది, సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఎంత సహాయపడుతోంది, అనవసరమైన పనిని ఎంతవరకు తగ్గిస్తోంది అనే విషయాలను పరిశీలించి, ఒక అంచనాకి రావచ్చు.
భారత దేశంలో కార్డియాలజీపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు?
భారత దేశంలో ఏఐ వినియోగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర స్పెషలిస్ట్ కార్డియాలజీ సేవలు ప్రధానంగా పెద్ద నగరాల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి.
రిమోట్ ఈసీజీ, ఎకో రివ్యూ, టెలీకార్డియాలజీ, వేరబుల్ మానిటరింగ్, క్లినికల్ డెసిషన్ సపోర్ట్ వంటి ఏఐ టెక్నాలజీల ద్వారా చిన్న నగరాలు, పట్టణాల్లోని రోగులకు కూడా స్పెషలిస్టు కార్డియాలజిస్ట్ సేవలను అందించేందుకు అవకాశాలు పెరగవచ్చు.
రాబోయే పదేళ్లలో పాత్ర ఈ టూల్స్‌తో కలిసి పనిచేసే విధంగా మరింత మారవచ్చు. ఏఐ పెద్ద మొత్తంలో సమాచారాన్ని చాలా వేగంగా ప్రాసెస్ చేయగలదు. కానీ ఆ సమాచారం వ్యక్తిగతంగా ఒక రోగి ఆరోగ్యం గురించి ఏం చెబుతోంది? దాని ఆధారంగా ఎలాంటి వైద్య నిర్ణయం తీసుకోవాలి? అనే బాధ్యత మాత్రం మీ పైనే ఉంటుంది.
డాక్టర్ ఎన్.మురళీకృష్ణ
సీనియర్ కన్సల్టెంట్, కార్డియాలజీ,
మణిపాల్ హాస్పిటల్, విజయవాడ
అపాయింట్‌మెంట్ కొరకు : 08645 - 669966
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..