ఇవి పోషక భాండాగారాలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:38 AM
మహిళలు క్రమం తప్పకుండా కొన్ని పోషక పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. పరిపూర్ణమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆ పదార్థాలు ఏవంటే....
గుడ్ ఫుడ్
మహిళలు క్రమం తప్పకుండా కొన్ని పోషక పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. పరిపూర్ణమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆ పదార్థాలు ఏవంటే....
గుడ్లు: గుడ్లలోని సెలీనియం, అయొడిన్, ప్రొటీన్‌ల వల్ల థైరాయిడ్ పనితీరు గాడిలో పడుతుంది.
గుమ్మడి విత్తనాలు: గుమ్మడి విత్తనాల్లో జింక్, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రెండు టీస్పూన్ల గుమ్మడి విత్తనాలను ప్రతి రోజూ తినగలిగితే హార్మోన్ల హెచ్చుతగ్గులు సమం అవుతాయి.
అవిసె గింజలు: వీటిలో లిగ్నేన్స్, పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి నడి వయసులో తలెత్తే ఈస్ట్రోజన్ హెచ్చుతగ్గులను సరి చేయాలనుకుంటే ప్రతి రోజూ ఒ టీస్పూన్ అవిసెగింజల పొడిని తీసుకుంటూ ఉండాలి.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..