Share News

ఆర్థిక స్వాతంత్య్రం తప్పనిసరి

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:13 AM

‘‘మహిళలు ఉద్యోగంలో చేరిన తరువాత చాలామంది ఉన్నత స్థానాలకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోతున్నారు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందుగా ఆ బాధ్యత పడేది గృహిణిపైనే...

ఆర్థిక స్వాతంత్య్రం తప్పనిసరి

సంకల్పం

‘‘మహిళలు ఉద్యోగంలో చేరిన తరువాత చాలామంది ఉన్నత స్థానాలకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోతున్నారు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా ముందుగా ఆ బాధ్యత పడేది గృహిణిపైనే. మహిళ సమాజంలో బయటకు వెళ్లి పని చేయాలంటే భర్త మాత్రమే సహకరిస్తే సరిపోదు. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి. ఇది వారి బాధ్యత’’ అంటారు విశాఖపట్నం పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోశ్ని అపరంజి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను ‘నవ్య’ పలుకరించింది.

‘‘మాది విశాఖపట్నం. నాన్న శుభాకరరావు పోర్టు స్కూల్‌లో టీచర్‌. అమ్మ హేమలత కేజీహెచ్‌లో హెడ్‌ నర్స్‌. ఒక్కతినే కుమార్తెను. నాన్న నన్ను కొడుకులాగే చూసుకున్నారు. ఆరో తరగతిలో ఉన్నప్పుడే కలెక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నా. బీఎ్‌ససీ బయోటెక్నాలజీ పూర్తయిన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో పీజీ చేశా. ఆ తరువాత సివిల్స్‌ కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నా. రెండో ప్రయత్నంలోనే అసోం కేడర్‌కు ఐఏఎ్‌సగా ఎంపికయ్యా. అక్కడ ఆరేళ్లు పని చేసిన తరువాత డిప్యుటేషన్‌పై విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వచ్చా.

ఆ సలహా అనుసరిస్తున్నా...

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. సంపాదించే ప్రతి మహిళ అందులో సగం ఇంట్లో సౌకర్యాల కోసం వెచ్చిస్తే మంచిదని నాకో నా సీనియర్‌ సలహా ఇచ్చారు. అదే ఫాలో అవుతున్నా. అలా డబ్బు వెచ్చించడం వల్ల ఇంటి పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఇబ్బంది ఉండదు. మగవాళ్లు ఆఫీసుకు వెళితే పనిలో నిమగ్నమైపోతారు. ఇల్లు గుర్తుకురాదు. అదే మహిళలైతే ఒకవైపు ఆఫీసులో పని చేస్తూనే, మరోవైపు ఇంట్లో పిల్లలు తిన్నారో... లేదో, అమ్మ మాత్రలు వేసుకుందా... మరిచిపోయిందా... అనే ఆలోచిస్తారు. మహిళలు మల్టీటాస్కర్లు. అన్నీ మేనేజ్‌ చేయగలుగుతారు. కొందరు ‘మా ఆవిడ ఏమీ చేయదు’ అంటుంటారు. భార్య ఏమీ చేయకుండా ఇల్లు ఎలా నడుస్తుంది? అన్నీ ఆమె చేస్తేనే భర్త ఉద్యోగానికి వెళుతున్నారనే విషయం మరిచిపోతున్నారు.


పొదుపు తప్పనిసరి

ఆర్థిక స్వాతంత్య్రం అంటే సంపాదించింది అంతా ఖర్చు చేయడం కాదు. నేనైతే ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేస్తాను. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బంగారం... ఇలా చాలా రకాలుగా పెట్టుబడి పెడతా. ఈ నిర్ణయాలన్నీ నావే. దానికి నా భర్త కీర్తికిరణ్‌ పూర్తిగా సహకరిస్తారు.

తెలియనివారితో పరిచయాలు వద్దు

ఇటీవల సోషల్‌ మీడియా ప్రభావంవల్ల ముక్కు ముఖం తెలియనివారితో ఆన్‌లైన్‌ పరిచయాలు పెంచుకొని మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి స్నేహాలు వద్దనే చెబుతాను. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడం మంచిది కాదు.

పిల్లలతో రోజూ గంటకు పైగానే...

మావారు సీఐఎ్‌సఎ్‌ఫలో కమాండెంట్‌గా పని చేస్తున్నారు. మాకు ఇద్దరు బాబులు. చిన్నవారే. రోజుకు కనీసం గంటన్నర సమయం వాళ్లకు కేటాయించి, వారితోనే ఉంటా. ఉదయం స్కూల్‌కు వెళ్లేంతవరకు అవసరమైనవన్నీ చూసుకుంటా. సాయంత్రం అన్నీ అడిగి తెలుసుకుంటా. అంతా కలిసే డిన్నర్‌ చేస్తాం.

ఏదైనా టీవీలోనే... నో మొబైల్‌

పిల్లలకు సోషల్‌ మీడియా అలవాటు చేయకూడదు. వారికి మొబైల్‌ కూడా ఇవ్వను. వారి చదువుకు సంబంధించి లేదా ఇతరత్రా ఏదైనా అవసరం ఉంటే... నా అకౌంట్‌ నుంచే టీవీలో ఆ కార్యక్రమం చూసుకునే ఏర్పాటు చేశా. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు దారి తప్పే అవకాశం ఉంది.

ఆరుగురు గన్‌మెన్ల సెక్యూరిటీ...

నేను అసోం కేడర్‌ ఐఏఎస్‌ అఽధికారిణి. అక్కడ ఎన్నికల సమయంలో ఇంటికి 48 గంటలపాటు వెళ్లకుండా క్షేత్ర స్థాయిలోనే పనిచేశా. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌, ఆరుగురు గన్‌మెన్లు నిత్యం వెంట ఉండేవారు. ఛాలెంజింగ్‌ పనులు చేయడం ఇష్టం.

  • యర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం డబ్బు సద్వినియోగం కావాలి మన దగ్గర డబ్బు ఉంటే అది సద్వినియోగం కావాలి అనేదే నా సిద్ధాంతం.

ఎవరికైనా ఆర్థిక సాయం కావాలంటే

మరో ఆలోచన లేకుండా చేస్తా. వారు మళ్లీ ఇస్తారా? లేదా? అనేది వేరే విషయం. వారి అవసరం తీరుతున్నది కదా! అనే ఆలోచిస్తాను.

లాభం లేకున్నా ఇస్తా

ఈసారి ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ‘గివ్‌ టు గెయిన్‌’ నినాదంతో నిర్వహిస్తున్నారు. అయితే మనకు లాభం లేకపోయినా... అవతల వారికి ఉపయోగం అంటే తప్పకుండా ఇవ్వాలి అనేది నా అభిప్రాయం.

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 02:13 AM