Share News

శ్వాస సునాయాసంగా...

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:52 AM

వేసవికి భిన్నంగా ఈ కాలంలో వ్యాధికారక సూక్ష్మక్రిములైన వైర్‌సలు, బ్యాక్టీరియాలు సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటాయి. అలాగే చలి వల్ల ఎక్కువ సమయాల పాటు ఇంట్లో గడపడం వల్ల కూడా...

శ్వాస సునాయాసంగా...

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! ప్రతి చలి కాలం నాకు శ్వాస ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రాత్రివేళ ఆయాసం పెరిగిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు సరైన చికిత్స సూచిస్తారా?

ఓ సోదరి, హైదరాబాద్‌.

వేసవికి భిన్నంగా ఈ కాలంలో వ్యాధికారక సూక్ష్మక్రిములైన వైర్‌సలు, బ్యాక్టీరియాలు సులభంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉంటాయి. అలాగే చలి వల్ల ఎక్కువ సమయాల పాటు ఇంట్లో గడపడం వల్ల కూడా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు పెరుగుతూ ఉంటాయి. ఇన్‌ఫ్లూయెంజా ఈ కోవకు చెందినదే! అలాగే రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌, ఎడినోవైర్‌సలు కూడా ఈ కాలంలో విపరీతంగా వ్యాపిస్తాయి. అలాగే ఉబ్బసం, సిఒపిడి రోగుల శ్వాసనాళాలు ఇరుకుగా ఉంటాయి. ఈ కాలంలో చల్లని గాలి పీల్చుకున్నప్పుడు ఆ శ్వాస మార్గాలు మరింత ఇరుకుగా మారిపోయి అటాక్స్‌ వేధించడం మొదలుపెడతాయి. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవలసిన అవసరం కూడా కొందర్లో తలెత్తుతూ ఉంటుంది. మీకున్న సమస్యను ఉబ్బసం వ్యాధిలా కనిపిస్తోంది. కాబట్టి వైద్యులను కలిసి వెంటనే చికిత్స మొదలుపెట్టడం మంచిది. అలాగే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.

అవేంటంటే...

స్కార్ఫ్‌, మాస్క్‌: ఈ కాలంలో తేమ తగ్గిపోయి గాలి పొడిగా, చల్లగా మారిపోతుంది. కాబట్టి ముక్కు, నోరు కప్పి ఉంచే స్కార్ఫ్‌ను ఉపయోగించాలి. స్కార్ఫ్‌ వల్ల పీల్చుకునే గాలి కొంతమేరకు వెచ్చబడి సమస్యకు అడ్డుకట్ట పడుతుంది.

ఇళ్లకే పరిమితం: ఊపిరితిత్తుల సమస్యలున్నవాళ్లు చలి ఎక్కువగా ఉండే, ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్లకే పరిమితం కావాలి.

నీరు: వాతావరణం పొడిగా మారిపోతుంది కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం సరిపడా గోరువెచ్చని నీళ్లు తాగాలి యాంటీ ఆక్సిడెంట్లు: ఈ పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, నట్స్‌ తరచూ తింటూ ఉండాలి. వీటితో ఇన్‌ఫెక్షన్లతో సమర్థంగా పోరాడే రోగనిరోధకశక్తి బలపడుతుంది.

డాక్టర్‌ వి. నాగార్జున మాటూరు

సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మొనాలజిస్ట్‌,

హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 05:52 AM