Share News

పసికందులకు పరీక్షలు అవసరమా?

ABN , Publish Date - May 07 , 2026 | 05:50 AM

పిల్లలు పుట్టిన వెంటనే ‘న్యూ బోర్న్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌’ చేయించటం అవసరం. కొందరు పసికందులు పుట్టుకతోనే కొన్ని ప్రాణాంతక జబ్బుల్ని వెంట తెచ్చుకుంటారు. వీటిని...

పసికందులకు పరీక్షలు అవసరమా?

కౌన్సెలింగ్‌

ప్రశ్న: పుట్టిన వెంటనే పిల్లలకు ఎలాంటి పరీక్షలు చేయించాలి? అవి ఎంతవరకూ అవసరం?

ఓ సోదరి, హైదరాబాద్‌

పిల్లలు పుట్టిన వెంటనే ‘న్యూ బోర్న్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌’ చేయించటం అవసరం. కొందరు పసికందులు పుట్టుకతోనే కొన్ని ప్రాణాంతక జబ్బుల్ని వెంట తెచ్చుకుంటారు. వీటిని ప్రారంభంలోనే గుర్తించకపోతే అవి పిల్లలతోపాటు పెరిగి వైద్యంతో సరిచేయలేనంత తీవ్రమవుతాయి. వీటిలో కొన్ని రుగ్మతలు, మానసిక వైకల్యానికి లోను చేయడం లేదా ప్రాణాలకే ప్రమాదం తలపెట్టడం చేస్తాయి. కాబట్టి ఇలాంటి వ్యాధులను ముందుగానే కనిపెట్టడం కోసం పసికందులు పుట్టిన ఒకటి రెండు రోజుల తర్వాత స్ర్కీనింగ్‌ చేయించాలి. దీంతో తీవ్రమైన రుగ్మతలు ఆ పసికందులకు వచ్చే అవకాశం ఉందో లేదో తెలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా జన్మతః థైరాయిడ్‌ హార్మోన్‌ తక్కువుగా ఉంటే ఆ హార్మోన్‌ను అందించి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా నియంత్రించవచ్చు. రక్త సంబంధ సమస్యలు, మేనరికం పిల్లల్లో తలెత్తే సమస్యలు... మొదలైన 44 రకాల ఆరోగ్య సమస్యలను న్యూ బోర్న్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌తో కనిపెట్టవచ్చు. చిన్న రక్తపరీక్షతో రుగ్మతలొచ్చే అవకాశాలను గుర్తించవచ్చు. కాబట్టి ప్రతి పసికందుకూ ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించడం అవసరం.

డాక్టర్‌ దినేశ్‌ కుమార్‌ చిర్ల,

పిడియాట్రీషియన్‌ అండ్‌ నియో నాటాలజిస్ట్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి:

సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్

భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!

Updated Date - May 07 , 2026 | 05:50 AM