షాంపూలో ఇవి కలిపితే...
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:41 AM
శిరోజాల సంరక్షణకు, మాడు మీద చర్మ సమస్యల నివారణకు షాంపూలో వేటిని కలపవచ్చో చూద్దాం...
శిరోజాల సంరక్షణకు, మాడు మీద చర్మ సమస్యల నివారణకు షాంపూలో వేటిని కలపవచ్చో చూద్దాం...
చిన్న గిన్నెలో కావాల్సినంత షాంపూ వేసి అందులో పావు కప్పు నుంచి అర కప్పు వరకు మంచి నీటిని పోసి బాగా కలపాలి. దీన్ని శిరోజాలకు పట్టించి తలస్నానం చేస్తే షాంపూలోని రసాయనాల ప్రభావం తగ్గుతుంది.
రెండు చెంచాల షాంపూలో చెంచా రోజ్ వాటర్ వేసి కలిపి మాడుకు పట్టిస్తే కుదుళ్ల వద్ద దురద, అలర్జీ, చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. శిరోజాలు నల్లగా మెరుస్తాయి కూడా.
ఓ కప్పులో రెండు చెంచాల షాంపూ వేసి అందులో రోజ్ మేరీ, లావెండర్, మింట్ ఆయిల్స్‌లో ఒకదాన్ని చెంచా మోతాదులో కలిపి దానితో తలస్నానం చేస్తే శిరోజాలు రాలడం ఆగుతుంది. మాడు పొడిబారడం తగ్గుతుంది. తగినంత తేమ అంది శిరోజాలు మృదువుగా మారతాయి.
తరచూ శిరోజాలు జిడ్డుగా మారుతూ చుండ్రు సమస్య వేధిస్తుంటే షాంపూలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే ప్రయోజనం ఉంటుంది.
కప్పులో రెండు చెంచాల షాంపూ, అర చెంచా కలబంద గుజ్జు లేదా ఉసిరి పొడి కలిపి తలకు పట్టించి ఆపైన గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
షాంపూలో కొద్దిగా అవిసె గింజల పొడిని కలిపి మాడుమీద మెల్లగా రుద్దితే రక్త ప్రసరణ పెరిగి కుదుళ్లు గట్టిపడతాయి.
మందారం పూలను ఆకులను మిక్సీలో వేసి కొన్ని నీళ్లు చిలకరించి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ గుజ్జును షాంపూలో కలిపి తలకు పట్టిస్తే మందారంలోని అమైనో ఆమ్లాలు మాడుమీద చర్మానికి, శిరోజాలకు పోషణను అందిస్తాయి.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు