Share News

బరువు తగ్గాలా!

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:44 AM

ప్రత్యేక సమయాన్ని కేటాయించకుండా బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి...

బరువు తగ్గాలా!

ప్రత్యేక సమయాన్ని కేటాయించకుండా బరువు తగ్గాలనుకునేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి...

  • చదువుకునేటప్పుడు, ఆఫీస్‌ వర్క్‌ చేసేటప్పుడు, మొబైల్‌ లేదా టీవీ చూసేటప్పుడు గంటలకొద్దీ ఒకేచోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేదంటే కనీసం అరగంటకోసారి లేచి అటు ఇటూ నడుస్తుంటే శరీరంలో కదలికలు ఏర్పడి వ్యాయామం చేసినట్లువుతుంది.

  • దగ్గరలో ఉన్న షాపు లేదా పార్కుకు వెళ్లేటప్పుడు వెహికిల్‌ను తీయకుండా నడిచి వెళ్లడం; లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, దిగడం అలవాటు చేసుకోవాలి.

  • మధ్యాహ్నం, రాత్రి భోజనాల తరువాత కనీసం పావుగంట నడవాలి. పడుకోవడానికి రెండు గంటల ముందే రాత్రి భోజనాన్ని ముగించాలి.

  • వారానికి రెండున్నర గంటలు తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఒకేసారి కాకుండా రోజూ చిన్న చిన్న సెషన్లుగా విభజించుకోవాలి. సమయానుసారం ఈత, సైక్లింగ్‌, ఏరోబిక్స్‌, యోగ, స్క్వాట్స్‌, రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ లాంటివి చేయడం మంచిది.

  • అల్పాహారాన్ని మానకూడదు. స్వీట్లు, నూనె పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మొలకలు, డ్రై ఫ్రూట్స్‌, గుడ్లు, చేపలు, పాలు, పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. తరచూ మంచినీటిని తాగుతూ ఉండాలి.

  • ఆహారాన్ని బాగా నమిలి తినాలి. దీనివల్ల జీర్ణక్రియతో పాటు జీవక్రియలన్నీ మెరుగుపడతాయి. శరీరంలో కొవ్వులు పేరుకోవు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

  • రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 12:44 AM