Share News

బరువు తగ్గలేకపోతున్నారా?

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:37 AM

బరువు తగ్గకపోవడానికి వ్యాయామం చేయకపోవడమే కారణమని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ అందుకు అదొక్కటే కారణం కాదు....

బరువు తగ్గలేకపోతున్నారా?

లైఫ్‌స్టైల్‌

బరువు తగ్గకపోవడానికి వ్యాయామం చేయకపోవడమే కారణమని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ అందుకు అదొక్కటే కారణం కాదు.

నిరంతరం ఆహారం మీదకే మనసు మళ్లుతూ ఉండడం, భావోద్వేగాలతో ముడిపడి ఉండే ఆకలి, కడుపు నిండిన భావన కలగకపోవడం, రోజంతా ఆహారం గురించే ఆలోచించడం... ఇవన్నీ బరువు తగ్గకపోవడానికి కారణాలే! నిజానికి రోజుకు రెండు భోజనాలతో అద్భుతంగా బరువు కోల్పోయేవాళ్లు ఉన్నారు. ఈ తరహా ఆహారశైలితో ఆకలి అదుపులో ఉంటుంది. శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరుకుంటాయి. అయితే ఈ ఆహారశైలి కోసం కొన్ని నియమాలు తప్పక పాటించాలి. రోజులో తినే ఆ రెండు భోజనాల మధ్య, ఏడు గంటల నిడివి ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఉదయం 11:30కు మొదటి భోజనం, సాయంత్రం 6:30కు రెండో భోజనం ముగించాలి. అలాగే ఇంకొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేంటంటే....

  • ఒకే భోజనం, ఒకే సమయాలకు కట్టుబడి ఉండాలి

  • భోజనం మినహా ఎలాంటి చిరుతిళ్లు తినకూడదు

  • కాఫీ, టీల జోలికి వెళ్లకూడదు

  • బ్లాక్‌ కాఫీ, నీళ్లు తాగొచ్చు

సాయంత్రం 6:30 నుంచి ఉదయం 11:30 వరకూ ఉపవాసం కొనసాగుతుంది. కాబట్టి ఆ సమయంలో శరీరం శక్తిని ఖర్చు చేయడం కోసం కొవ్వు మీదే ఆధారపడుతుంది. దాంతో అదనపు కొవ్వు కరిగి, బరువు తగ్గుతాం! బదులుగా రాత్రుళ్లు ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ రాత్రంతా చురుగ్గా ఉండి, శరీరం విశ్రాంతి స్థితిలోకి చేరుకోలేదు.


భోజనంలో...

మొదటి భోజనంలో పొట్రీన్‌, పిండి పదార్థాలు, కొవ్వులు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. సమతులాహారం ఆకలిని దూరం పెట్టి, ఎనర్జీ లెవల్స్‌ను నిలిపి ఉంచుతుంది. సాయంత్రం భోజనాన్ని వీలైనంత తక్కువ ఆహారంతో సరిపెట్టుకునే ప్రయత్నం చేయాలి. కడుపు నిండిన భావన కలిగితే సరిపోతుంది. మరుసటి ఉదయం 11:30 వరకూ ఆహారం ఉండదనే బెంగతో అతిగా తినే ప్రయత్నం చేయకూడదు. ఎంత ఎక్కువ చిరుతిళ్లు తింటే, మనసు అంత ఎక్కువగా తిండి మీదకు మళ్లుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చిరుతిళ్ల జోలికి వెళ్లకూడదు. సాధారణంగా పండ్లరసం, పాలు, డైట్‌ సోడాలు బరువు పెంచవని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ బరువు పెంచుతాయి. ఈ అదనపు క్యాలరీలతో బరువు తగ్గాలనే లక్ష్యానికి అవరోధం ఏర్పడుతుంది. రోజుకు రెండు భోజనాల నియమాన్ని రెండు వారాల పాటు క్రమశిక్షణతో కొనసాగించగలిగితే, కచ్చితంగా బరువు తగ్గుతారు.

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 12:37 AM