Share News

వార్డ్‌రోబ్‌ రీఆర్గనైజేషన్‌

ABN , Publish Date - Feb 16 , 2026 | 05:07 AM

శీతాకాలపు భారీ దుస్తులు, గొడులు, స్వెటర్లను పక్కనపెట్టి, వేసవికి తగినట్టుగా వార్డ్‌రోబ్‌ను సిద్ధం చేసుకోవడం...

వార్డ్‌రోబ్‌ రీఆర్గనైజేషన్‌

శీతాకాలపు భారీ దుస్తులు, గొడులు, స్వెటర్లను పక్కనపెట్టి, వేసవికి తగినట్టుగా వార్డ్‌రోబ్‌ను సిద్ధం చేసుకోవడం ఒక పెద్ద పని. దీనిని పద్ధతిగా చేస్తే బట్టలు పాడవకుండా ఉంటాయి. రోజువారీగా రెడీ అవడం సులభమవుతుంది.

వింటర్‌వేర్‌ స్టోరేజ్‌: స్వెటర్లు, జెర్కిన్లు, భారీ రగ్గులను బాగా ఉతికి, ఆరబెట్టిన తర్వాతే లోపల పెట్టాలి. లేకపోతే చెమట వాసనవల్ల అవి పాడవుతాయి. వాటిని వాక్యూమ్‌ బ్యాగుల్లో ఉంచితే బీరువాలో స్థలం ఆదా అవుతుంది.

ఫ్యాబ్రిక్‌ ఎంపిక: సింథటిక్‌, పాలిస్టర్‌ బట్టలను లోపలి వైపునకు జరిపి.. ప్యూర్‌ కాటన్‌, లెనిన్‌ తదితర దుస్తులను అందుబాటులో ఉండేలా ముందువైపు సర్దుకోవాలి. ఇవి గాలిని ప్రసరింపజేసి చెమటను పీల్చుకుంటాయి.

పాదరక్షలు: వేసవిలో కాళ్లకు చెమటపట్టడం వల్ల షూస్‌ వాసన వచ్చే అవకాశం ఉంది. వాటిని ఎండలో కాసేపు ఉంచి లోపల బేకింగ్‌ సోడా చల్లితే వాసన పోతుంది. సాక్సులను రోజూ మార్చడం మర్చిపోవద్దు.

సన్‌గ్లాసె్‌స, క్యాప్స్‌: బయటకు వెళ్లేటప్పుడు అవసరమయ్యే సన్‌గ్లాసె్‌స, గొడుగులు, స్కార్ప్‌లు, సన్‌స్ర్కీన్‌ లోషన్ల కోసం వార్డ్‌రోబ్‌లో ఒక చిన్న బాస్కెట్‌ కేటాయించండి. దీనివల్ల చివరి నిమిషంలో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

శక్తితోనే సాధించాం!

Updated Date - Feb 16 , 2026 | 05:07 AM