ఇలా తీసేయాలి...
ABN , Publish Date - Aug 29 , 2026 | 05:03 AM
వాల్ స్టిక్కర్స్ తొలగించే టప్పుడు గోడ పెయింట్ పాడవకుండా, జిగురు మరకలు పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
వాల్ స్టిక్కర్స్ తొలగించే టప్పుడు గోడ పెయింట్ పాడవకుండా, జిగురు మరకలు పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
ఫ వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చటి నీటిని తీసుకుని అందులో చెంచా లిక్విడ్ సోప్ లేదా డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. అందులో స్పాంజ్ లేదా పాత తువాలును ముంచి చేత్తో కొద్దిగా పిండి ఆపైన స్టిక్కర్‌పై పదినిమిషాలపాటు అదిమి ఉంచాలి. అప్పుడు స్టిక్కర్ మెత్తబడి తేలికగా గోడనుంచి ఊడి వచ్చేస్తుంది.
ఫ నాలుగైదు టిష్యూ పేపర్లను వైట్ వెనిగర్‌లో ముంచి స్టిక్కర్‌పై అంటిస్తే అయిదు నిమిషాల్లో అది గోడ నుంచి విడిపోతుంది.
ఫ హెయిర్ డ్రైయర్‌ను మీడియం హీట్‌లో సెట్ చేసి స్టిక్కర్ మీద వేడి గాలి వీచేలా చూడాలి. అయిదు నిమిషాల్లో స్టిక్కర్‌కి ఉన్న జిగురు కరిగి గోడనుంచి తేలికగా ఊడి వచ్చేస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు