గోడలపై పగుళ్లు కనిపించకుండా
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:44 AM
ఇంట్లో గోడలపై ఏర్పడే చిన్న చిన్న పగుళ్లను కప్పేస్తూ పెద్ద వాటిని కనబడకుండా ఎలా దాచేయాలో చూద్దాం...
ఇంట్లో గోడలపై ఏర్పడే చిన్న చిన్న పగుళ్లను కప్పేస్తూ పెద్ద వాటిని కనబడకుండా ఎలా దాచేయాలో చూద్దాం...
పగుళ్లు చిన్నగా ఉన్నట్లయితే ఆ గోడపై చక్కని పెయింట్ వేస్తే సరిపోతుంది. లేత క్రీమ్, మ్యూటెడ్ బ్లేజ్, పాస్టెల్ కలర్స్ ఎంపిక చేసుకుంటే గోడ కొత్తగా అందంగా కనిపిస్తుంది.
గోడ దెబ్బతిని పెయింట్ వేసినా కూడా కనిపిస్తుంటే దానిమీద పీవీసీ, ఫ్లూటెడ్, డెకరేటివ్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తే చూడడానికి బాగుంటుంది.
పగుళ్లు ఏర్పడిన గోడమీద ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేస్తే గది విశాలంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. గోడ అందం ఇనుమడిస్తుంది.
గోడమీద కుటుంబ సభ్యుల ఫొటోలు, మధ్య మధ్యలో కొన్ని కళాకృతులు, ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబించే ఫొటోలు ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుంది.
పగుళ్లు ఉన్న చోట అవి కనిపించకుండా గోడపై రంగు రంగుల కాన్వా్‌సను అమరిస్తే బాగుంటుంది.
పొడవుగా, గుబురుగా పెరిగే ఇండోర్ ప్లాంట్ల కుండీలను గోడకు దగ్గరలో ఏర్పాటు చేసినా మంచి ఫలితం ఉంటుంది.
లేత రంగులతో కూడిన టెక్చర్డ్ డిజైన్లు, అహ్లాదరకరమైన ప్రింట్లు, సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలతో కూడిన వాల్ పేపర్‌ను గోడపై అంటించవచ్చు.
ఇవి కూడా చదవండి..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. లీటర్‌కు రూ.5, రూ.3 పెంచిన నయారా ఎనర్జీ
కొడుకును మార్చాలనుకుంది.. చివరకు తానే మారిపోయింది.. ఈ చైనా మహిళ కథేంటంటే..