కె విటమిన్ లోపిస్తే...
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:38 AM
శరీరంలో కె విటమిన్ లోపించడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం...
శరీరంలో కె విటమిన్ లోపించడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం...
కనిపించే ఆరోగ్య సమస్యలు
శరీర భాగాలపై చిన్న గాయమైనా రక్తస్రావం ఆగదు. రక్తం త్వరగా గడ్డకట్టదు. ముక్కు, చిగుళ్ల నుంచి తరచూ రక్తస్రావమవుతుంటుంది. ఎముకల్లో సాంద్రత తగ్గడంతో అవి పెళుసుగా మారతాయి. రక్తహీనత ఏర్పడి ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంటుంది. శిరోజాలు రాలడం, బరువు తగ్గడం గమనించవచ్చు. ధమనుల్లో కాల్షియం చేరి రక్తనాళాలు గట్టిపడతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. అలాగే మూతపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఊపిరితిత్తులు దెబ్బతిని ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు.
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
బచ్చలి, పాలకూర, తోటకూర, గోంగూర లాంటి ఆకుకూరల్లో; క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, ఉల్లికాడల్లో కె విటమిన్ అధికంగా ఉంటుంది. వారానికి రెండుసార్లయినా వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగు, వెన్న, నెయ్యి, చీజ్, కోడిగుడ్లు, చేపలు, సోయాబీన్స్, పచ్చి బఠాణీలను కూడా తరచూ తీసుకుంటుండాలి. కివీ, అవకాడో, ఎండిన రేగు పండ్లు, డ్రై అంజూర్, ద్రాక్ష, యాపిల్, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలు తినడం వల్ల కె విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. జీడిపప్పు, వాల్‌నట్స్, హేజల్ నట్స్ తింటూ మంచి ప్రయోజనం పొందవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..