Share News

మొక్కలు వాడిపోతున్నాయా..?

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:41 AM

వేసవికాలంలో ఎండ వేడికి మొక్కలు వాడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

మొక్కలు వాడిపోతున్నాయా..?

వేసవికాలంలో ఎండ వేడికి మొక్కలు వాడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

  • ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్కలకు నీటిని అందించాలి. ఆకులు, కాండం తడిసేలా నీటిని చిలకరించాలి. మట్టి తడారిపోకుండా రోజంతా తేమగా ఉండేలా చూసుకోవాలి.

  • మొక్కల చుట్టూ గడ్డి పరకలు, ఎండిన ఆకులు, కొబ్బరి పీచు, కొబ్బరి చిప్పల పెంకులు పరచాలి. వీటివల్ల మట్టి ఎప్పుడూ తడిగా ఉంటుంది. దీంతో వేర్లు బలంగా పెరిగి మొక్కలకు కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి.

  • మొక్కలకు అధికంగా వేడి తగలకుండా వాటిపై గ్రీన్‌ నెట్‌ లేదా షెడ్‌ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టెర్రస్‌ గార్డెన్‌, బాల్కనీలో పెట్టుకునే కుండీలకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఎండాకాలంలో మొక్కలకు రసాయనిక ఎరువులు వాడకూడదు. వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, ఇంటి వ్యర్థాలతో తయారుచేసిన ఎరువులను అందిస్తే సరిపోతుంది.

ఈ వార్తలనూ చదవండి:

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి

Updated Date - Jun 01 , 2026 | 12:41 AM