కూరగాయలు తాజాగా!
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:45 AM
వేసవి వేడికి కూరగాయలు పోషకాలను నష్టపోకుండా ఉండాలంటే, వాటి నిల్వకు తగిన పద్ధతులను అనుసరించాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్....
వేసవి వేడికి కూరగాయలు పోషకాలను నష్టపోకుండా ఉండాలంటే, వాటి నిల్వకు తగిన పద్ధతులను అనుసరించాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అందుకోసం సూచిస్తున్న జాగ్రత్తలివే!
వేసవిలో వేడి వల్ల కూరగాయలు వేగంగా తాజాదనాన్ని కోల్పోతాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల, కూరగాయల్లోని తేమ ఆవిరైపోయి, బ్యాక్టీరియా, ఫంగ్‌సలు వృద్ధి చెందుతాయి. కొనే సమయంలో మార్కెట్లో తాజాగా కనిపించిన కూరగాయలు ఇంట్లో త్వరగా వడలిపోతూ ఉండడానికి కారణం ఇదే! ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవాలి.
పొడిగా తుడవడం అవసరమా?
చాలా మంది కూరగాయలను నీళ్లలో శుభ్రంగా కడిగి అలాగే ఫ్రిజ్‌లో సర్దేస్తూ ఉంటారు. కానీ అదనపు తేమ వల్ల కూరగాయలు త్వరగా పాడైపోవడం మొదలుపెడతాయి. కాబట్టి కడిగిన కూరగాయలను తడి లేకుండా తుడిచి, భద్రపరుచుకోవాలి. ఆకుకూరల్లో సహజసిద్ధంగానే ఎక్కువ నీరు ఉంటుంది. కాబట్టి అదనపు తేమను పీల్చుకునేలా ఆకుకూరలను పేపర్ టవల్‌లో చుట్టి నిల్వ చేసుకోవాలి. దీంతో ఆకుకూరలు వడలిపోకుండా, నీరు కారకుండా, తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటాయి.
పర్ఫొరేటెడ్ బ్యాగ్స్
కూరగాయల నిల్వకు ప్లాస్టిక్ బ్యాగ్స్‌కు బదులుగా పర్ఫొరేటెడ్ బ్యాగ్స్ వాడుకోవాలి. కూరగాయలకు గాలి సోకుతూ ఉండాలి. వాటిని గాలి చొరబడే వీల్లేని ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉంచితే, తేమ బయటకెళ్లే వీలు లేక, ఘనీభవన చర్య జరుగుతుంది. కాబట్టి నెట్ లేదా పర్ఫొరేటెడ్ బ్యాగ్స్ వాడడం వల్ల గాలి ప్రసరించి, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉంటాయి
ఇంట్లో దొర్లే తప్పులు ఇవే!
గాలి ప్రసరించేలా:
కూరగాయలన్నిటినీ ఒకే చోట నిల్వ చేయడం, అవసరానికి మించి కుక్కేయడం సరి కాదు. దీంతో గాలి ప్రసరించే వీల్లేక కూరగాయలు తాజాదనం కోల్పోతాయి.
పాడైన కూరగాయలు:
చాలా సందర్భాల్లో పాడైన కూరగాయలను మంచి వాటితో కలిపి నిల్వ చేయడం వల్ల, మంచివన్నీ పాడవుతాయి.
ఈ వార్తలనూ చదవండి:
సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన
యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి