Share News

ఇలా చదివించాలి

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:49 AM

పిల్లలు రోజూ క్రమశిక్షణతో చదవాలన్నా, వారికి చదివినవి గుర్తుండాలన్నా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

ఇలా చదివించాలి

పిల్లలు రోజూ క్రమశిక్షణతో చదవాలన్నా, వారికి చదివినవి గుర్తుండాలన్నా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

  • ఫ పిల్లలకు ఏ అంశాన్నైనా అర్థం చేసుకుంటూ చదవడాన్ని నేర్పించాలి. అప్పుడే వారికి చదివినవి ఎక్కువకాలం గుర్తుంటాయి. బట్టీపట్టే ప్రయత్నాలను ప్రోత్సహించకూడదు. పిల్లలు ఏవైనా సందేహాలు అడిగితే వివరించి చెప్పాలి.

  • ఫ పాఠాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటూ చదవడాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. దీనివల్ల అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఒక్కో భాగం పూర్తవుతుంటే మిగిలినవాటిని చదవడానికి పిల్లలు ఉత్సాహం చూపిస్తారు.

  • ఫ పిల్లలు పాఠాన్ని చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను క్లుప్తంగా నోట్స్‌ రాయమని చెప్పాలి.

  • ఫ ఒకసారి చదివిన పాఠాలను, నోట్స్‌ని వీలున్నప్పుడల్లా పిల్లలచేత రివిజన్‌ చేయించాలి. దీనివల్ల వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.

  • ఫ చదివిన అంశాలను స్కూల్లో తోటి పిల్లలతో చర్చించమని చెప్పాలి. దీనివల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది.

  • ఫ పిల్లలు చదువుకునేటప్పుడు గదిలో నిశ్శబ్దంగా ఉండేలా చూడాలి. గాలి, వెలుతురు ప్రసరించేలా ఏర్పాటు చేయాలి.

ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 20 , 2026 | 04:49 AM