టూత్‌పేస్టుతో ఇలా కూడా...
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:54 AM
దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే తెల్లటి టూత్‌పేస్టుతో చిన్న చిట్కాలు పాటించి పలు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే...
దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే తెల్లటి టూత్‌పేస్టుతో చిన్న చిట్కాలు పాటించి పలు సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే...
చిన్న పిల్లలు... క్రేయాన్స్, రంగుల పెన్సిళ్లు, స్కెచ్ పెన్నులతో ఇంటి గోడలపై బొమ్మలు వేస్తూ గీతలు గీస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటిపై కొద్దిగా టూత్‌పేస్టు రాసి కొద్దిసేపు ఆరనివ్వాలి. తరువాత తడి గుడ్డతో మెల్లగా తుడవాలి. టూత్‌పేస్టులో ఉండే సర్ఫ్యాక్టెంట్స్ అనే రసాయనం మరకలను సులువుగా విచ్ఛిన్నం చేస్తుంది.
సింక్‌పై లేదంటే బాత్‌రూమ్‌లో ఉండే అద్దంపై తరచూ నీటి మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిపై కూడా టూత్‌పేస్టు రాసి పలుచని గుడ్డతో మెల్లగా రుద్దాలి. తరువాత తడిగుడ్డతో తుడిచేస్తే మరకలన్నీ తొలగి అద్దం తళతళలాడుతుంది.
తెల్లటి షూస్‌పై తరచూ మట్టి లేదా బురద మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిపై పాత టూత్‌బ్రష్ సహాయంతో తెల్లటి టూత్‌పేస్టు రాసి టిష్యూ పేపర్‌తో రుద్దుతూ తుడిస్తే షూస్ కొత్తవాటిలా మెరుస్తాయి.
కళ్లద్దాలు లేదా గాగుల్స్‌పై మబ్బు మరకలు ఏర్పడి అవి మసకబారుతుంటాయి. అలాంటప్పుడు అద్దాలపై కొద్దిగా టూత్‌పేస్టు రాసి తడిగుడ్డతో తుడిచేస్తే సరి.
ఉల్లి, వెల్లుల్లి, చేపలు లాంటివాటిని తరిగినప్పుడు చేతులకు వాటి ఘాటైన వసనలు పట్టేస్తూ ఉంటాయి. వెంటనే అరచేతిలో కొద్దిగా టూత్‌పేస్టును తీసుకుని రెండు చేతులతో గట్టిగా రుద్దుతూ చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే సమస్య తీరుతుంది.
గోడలకు కొట్టిన మేకులు, ఇతర స్ర్కూలు ఊడిపోయినప్పుడు ఆ రంధ్రాల్లో టూత్‌పేస్టును నింపితే ఆరిన తరువాత నీట్‌గా ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో