పిల్లలతో కలిసి ఆనందంగా...
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:28 AM
తల్లిదండ్రులు చూపించే శ్రద్ధ, ప్రేమాభిమానాలు... పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి...
తల్లిదండ్రులు చూపించే శ్రద్ధ, ప్రేమాభిమానాలు... పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి తల్లిదండ్రులు రోజూ కొంత సమయాన్ని పిల్లలతో గడపడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అదెలాగంటే...
ఇంత సమయం అని కాకుండా ఎంత సంతోషంగా గడుపుతున్నామనేదాన్నే తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాలి.
పిల్లలతో కలిసి రంగు రంగుల బ్లాక్స్‌తో బిల్డింగులు కట్టడం, బొమ్మలు గీయడం, కథలు చదవడం లాంటివి చేస్తూ ఉంటే వారి ఆనందానికి హద్దుండదు.
సెలవు రోజుల్లో పిల్లలతో కలిసి అల్పాహారం చేయడం, కుటుంబ సభ్యులంతా కలిసి సినిమా చూడడం, భోజన సమయంలో సరదాగా మాట్లాడుకోవడం లాంటివి తరచూ కొనసాగిస్తూ ఉండాలి.
వంట, ఇంటిపని, తోటపని లాంటివి చేసేటప్పుడు పిల్లలకు కూడా చిన్న చిన్న పనులు చెప్పి చెయిస్తూ ఉండాలి. బజారుకు వెళ్లేటప్పుడు వాళ్లని కూడా వెంట తీసుకెళ్లాలి. పిల్లలు అడిగే ప్రశ్నలకు సరళంగా ఓపిగ్గా సమాధానాలు చెప్పాలి.
పిల్లలతో కలిసి డ్యాన్స్ చేయడం, బంకమట్టితో బొమ్మలు తయారుచేయడం, వాటికి రంగులు వేయడం, తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల వారి మనసు అహ్లాదకరంగా మారుతుంది.
ఈ రోజు బడిలో ఏం జరిగింది? ఏ ఆటలు ఆడారు? అని అడిగితే చాలు పిల్లలు ఆనందంగా ఎన్నో విషయాలు చెప్పేస్తారు.
పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే చిన్నపాటి ఆలోచనలను పంచుకుంటుంటే పిల్లలకు ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడుతుంది.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత