Share News

మనీ ప్లాంట్‌ ఏపుగా

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:20 AM

కుండీలో మనీ ప్లాంట్‌ ఏపుగా గుబురుగా పెరగాలంటే పాటించాల్సిన జాగ్రత్తలివే..

మనీ ప్లాంట్‌ ఏపుగా

కుండీలో మనీ ప్లాంట్‌ ఏపుగా గుబురుగా పెరగాలంటే పాటించాల్సిన జాగ్రత్తలివే..

  • ఈ మొక్క ఆకులకు ఎండ నేరుగా తగిలితే అవి పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. కాబట్టి దీనికి సహజ వెలుతురు సరిపోతుంది.

  • దీనికి ఎక్కువగా నీళ్లు పోయకూడదు. కుండీలో మట్టి బాగా పొడిబారినప్పుడు మాత్రమే కొద్దిగా నీటిని చిలకరించాలి. మట్టి తడిసిన తరువాత మిగిలిన నీళ్లు బయటికి వెళ్లేందుకు కుండీ అడుగున తప్పనిసరిగా రంధ్రాలు చేయాలి.

  • మట్టిలో కొద్దిగా ఇసుక, కోకోపీట్‌ కలిపితే మొక్క ఏపుగా పెరుగుతుంది. ఆకులు కూడా వెడల్పుగా వస్తాయి.

  • ఆకులపై దుమ్ము చేరకుండా చూసుకో వాలి. వారానికి రెండుసార్లు వాటిని తడి గుడ్డ లేదా స్పాంజ్‌తో జాగ్రత్తగా తుడవాలి. అప్పుడే అవి పచ్చగా మెరుస్తుంటాయి.

  • మనీ ప్లాంట్‌ నీటిలో కూడా పెరుగుతుంది. గాజుసీసాలో నీటిని నింపి అందులో మొక్కను పెంచవచ్చు. వారానికోసారి నీటిని మారుస్తుండాలి.

  • ఇది తీగజాతి మొక్క కాబట్టి పొడవుగా పెరుగుతుంది. అలా కొమ్మ పెరుగుతూ పోతే చూడడానికి అంత అందంగా ఉండదు. అప్పుడప్పుడు కొమ్మ చివర్లను కత్తిరిస్తుంటే పక్కల నుంచి అదనపు కొమ్మలు పెరిగి మొక్క గుబురుగా మారుతుంది. కత్తిరించిన కొమ్మలను కావాల్సినవారికి ఇవ్వవచ్చు. లేదంటే వేరే కుండీలో నాటవచ్చు.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 01:20 AM