కొబ్బరిబొండాల ఎంపిక ఇలా...
ABN , Publish Date - May 02 , 2026 | 01:29 AM
కొబ్బరి నీళ్లు దాహాన్ని తీర్చి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే వేసవికాలంలో తరచూ మనం కొబ్బరిబొండాలను కొనుక్కుంటూ ఉంటాం. కొనేముందు ఎక్కువ నీళ్లున్న...
కొబ్బరి నీళ్లు దాహాన్ని తీర్చి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే వేసవికాలంలో తరచూ మనం కొబ్బరిబొండాలను కొనుక్కుంటూ ఉంటాం. కొనేముందు ఎక్కువ నీళ్లున్న కొబ్బరిబొండాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...
కొబ్బరిబొండాన్ని చేత్తో పట్టుకుని చెవికి దగ్గరగా ఉంచి వేగంగా ఊపాలి. నీళ్ల శబ్దం ఎక్కువగా వస్తున్నట్లయితే అందులో నీళ్లు తక్కువగా ఉన్నాయని గుర్తించాలి. శబ్దం అసలు వినిపించకపోయినా, కొద్దిపాటి శబ్దం వచ్చినా అందులో ఎక్కువ నీళ్లు ఉన్నాయని తెలుసుకోవాలి. అలాంటివాటిని కొనడం మంచిది.
కొనేముందు కొబ్బరిబొండాల ఆకారాన్ని పరిశీలించాలి. పైన త్రిభుజాకారంగా కనిపించే వాటిలో నీళ్లు ఉండవు. గుండ్రంగా లేదా కోలగా ఉండే వాటిలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.
కొబ్బరిబొండాం కాడ వద్ద లోతైన గుంట ఉండి చుట్టూ పచ్చగా కనిపిస్తుంటే అది తాజాదని గుర్తించాలి. అదే నల్లటి మచ్చలు, రంధ్రాలు కనిపిస్తే లోపల పాడైనదిగా తెలుసుకోవచ్చు.
కొనేముందు కొబ్బరిబొండాల బరువును పరిశీలించాలి. బరువుగా అనిపించినవాటిలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.
కొబ్బరిబొండాన్ని చేత్తో తట్టినప్పుడు శబ్దం పెద్దగా వస్తే అందులో నీళ్లు లేవని అర్థం. అదే బరువైన తేలికపాటి శబ్దం వినిపిస్తే అది నీళ్లతో నిండినదిగా గుర్తించాలి.
ఆకుపచ్చగా కనిపించే బొండాల్లో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా లేత పసుపు మిళితమై ఉన్నవాటిని కూడా కొనుక్కోవచ్చు. గోధుమ రంగులో ఎండినట్లుండే వాటిలో నీళ్లు తక్కువగా ఉంటాయి. వీటిని కొనకూడదు.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ