Share News

చిలగడదుంపలు తిందాం...

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:48 AM

చిలగడదుంపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి...

చిలగడదుంపలు తిందాం...

చిలగడదుంపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

  • చిలగడదుంపల్లో బీటా కెరోటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ‘ఎ’ విటమిన్‌గా మారి పలురకాల కంటి సమస్యలను ముఖ్యంగా రేచీకటిని నివారిస్తుంది.

  • చిలగడదుంపలను ఉడికించి లేదా కాల్చి తింటే మధుమేహం, రక్తపోటు అదుపులోకి వస్తాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది

  • వీటిలోని సి విటమిన్‌, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కలిసి శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి. వ్యాధికారక ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి. కండరాల వాపుని తగ్గిస్తాయి.

  • చిలగడదుంపల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణాశయం, పేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

  • వీటి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. కాబట్టి తరచూ తిన్నా శరీరం బరువు పెరగదు.

  • వీటిలోని ‘ఇ’ విటమిన్‌.. చర్మం ముడుతలు పడకుండా కాపాడుతుంది. చర్మకణాల్లో కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచి అకాల వార్థక్యాన్ని నివారిస్తుంది. మొటిమలు, మచ్చలను నివారించి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.

  • వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు, పిండిపదార్థాలు కలిసి శరీరానికి తక్షణశక్తిని అందిస్తాయి.

  • చిలగడదుంపల్లో ‘బి 6’ విటమిన్‌, పాంతోనిక్‌ యాసిడ్‌ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రత, జ్ఞాపకశక్తితోపాటు చురుకుదనాన్ని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 05:48 AM