Share News

పొద్దు తిరుగుడు గింజలు తిందాం

ABN , Publish Date - May 13 , 2026 | 04:18 AM

పొద్దు తిరుగుడు గింజలను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...

పొద్దు తిరుగుడు గింజలు తిందాం

పొద్దు తిరుగుడు గింజలను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...

  • పొద్దు తిరుగుడు గింజల్లో లినోలిక్‌, అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు రక్తనాళాలను సడలించి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

  • వీటిలో ఉండే ఇ విటమిన్‌, సెలీనియం కలిసి ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలను నివారిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ ఇన్ఫెక్షన్లకు గురయ్యేవారికి పొద్దు తిరుగుడు గింజలు ఔషధంలా పనిచేస్తాయి.

  • తరచూ పొద్దు తిరుగుడు గింజలను తీసుకుంటూ ఉంటే అకాల వార్థక్యం రాదు. ముడతలు, గీతలు లేకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

  • రోజూ పొద్దు తిరుగుడు గింజలను తినడం వల్ల తగినంత జింక్‌, ఇతర పోషకాలు అంది జుట్టు సమస్యలు తీరుతాయి. కుదుళ్లు బలోపేతమై శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.

  • వీటిలోని మెగ్నీషియం ఎముకల దృఢత్వానికి తోడ్పడడంతోపాటు నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయి.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 13 , 2026 | 04:18 AM