అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత
ABN , Publish Date - May 11 , 2026 | 10:56 AM
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారత్‌లో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
ఇంటర్నెట్ డెస్క్: యుద్ధ విరమణకు సంబంధించి ఇరాన్ ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. దీంతో, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో, నేడు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (మే 11) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,130కు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ధర రూ.220ల మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.200ల మేర తగ్గి రూ.1,39,450కు పడిపోయింది. నగరంలో వెండి ధర మాత్రం పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే కిలో వెండి ధర రూ.5 వేల మేర పెరిగి రూ.2.85 లక్షల వద్ద ట్రేడవుతోంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,820గా ఉంది. ఢిల్లీలో రూ.1,52,280గా, ముంబైలో రూ.1,52,130గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,000ల వద్ద ట్రేడవుతోంది. ముంబైలో ధర రూ.1,39,450గా, ఢిల్లీలో 1,39,600గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.2.85 లక్షలకు పెరిగింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ 24 క్యారెట్ల బంగారం ధర 1 శాతం మేర తగ్గి 4,670 వద్ద ట్రేడవుతోంది. ఔన్స్ వెండి ధర మాత్రం 81 డాలర్లకు పెరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
ఇంధన కంపెనీలపై యుద్ధ ప్రభావం.. రోజుకు రూ.1,600-1,700 కోట్ల నష్టం