మనలో ఒత్తిడి
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:29 AM
మనలో ఒత్తిడి పెరుగుతున్నట్టు మనంతట మనం గ్రహించలేం! కానీ మన శరీరం కొన్ని లక్షణాల రూపంలో సూచనలు అందిస్తూనే ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం!...
ఒత్తిడి చిత్తు
మనలో ఒత్తిడి పెరుగుతున్నట్టు మనంతట మనం గ్రహించలేం! కానీ మన శరీరం కొన్ని లక్షణాల రూపంలో సూచనలు అందిస్తూనే ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం!
కన్ను అదరడం: నాడీ వ్యవస్థ అతిగా ప్రేరేపితమైనప్పుడు సూక్ష్మ కండరాలు కూడా ప్రేరేపితమవుతాయి. ఒత్తిడి దూరమై, ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు కూడా మన శరీరం అప్రమత్త దశ నుంచి బయటపడలేదనడానికి సూచనగా మన కన్ను అదురుతూ ఉంటుంది.
కడుపుబ్బరం: తీవ్రమైన ఒత్తిడి వల్ల జీర్ణశక్తి కుంటుపడుతుంది. ఒత్తిడికి లోనయ్యే శరీరం తన శక్తిని ప్రాణాలు నిలుపుకోవడానికి కేటాయించడమే ఇందుకు కారణం. దాంతో జీర్ణశక్తి కుంటుపడి కడుపుబ్బరం, అజీర్తి సమస్యలు వేధిస్తాయి.
శరీర ఉష్ణోగ్రత: ఒత్తిడి శరీర ఉష్ణోగ్రతను కూడా హెచ్చుతగ్గులకు లోను చేస్తుంది. ఫలితంగా రక్త ప్రవాహం, అడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తులు ప్రభావితమవుతాయి. ఇలా శరీరంలో అకస్మాత్తుగా చోటుచేసుకునే మార్పుల వల్ల నాడీ వ్యవస్థ సంతులనాన్ని సాధించలేదు. దాంతో శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి.
కార్టిసాల్: ఒత్తిడితో శరీరంలో ఉత్పత్తయ్యే అధిక కార్టిసాల్ హార్మోన్ వల్ల, చర్మం, రక్తనాళాలు ప్రభావితమై సులభంగా గాయాలవుతాయి.
అలసట: ఒత్తిడితో ఉదయమంతా సర్వైవల్ మోడ్‌లో ఉండిపోవడం వల్ల, శక్తి మొత్తం వేగంగా ఖర్చయిపోయి, మధ్యాహ్నానికి నిస్సత్తువ ఆవరిస్తుంది.
వెంట్రుకలు రాలిపోవడం: ఒత్తిడితో శరీరం శక్తిని నిల్వ చేసుకునే మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దాంతో అవసరం లేని పనులకు శక్తిని ఖర్చు పెట్టడం మానేస్తుంది. ఫలితంగా వెంట్రుకల పెరుగుదల మందగిస్తుంది. వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి.
మగత/మతిమరుపు: ఒత్తిడికి లోనైన మెదడు, ముప్పును పసిగట్టడం మీదే దృష్టి పెడుతుంది. నిరంతరం ప్రమాదం కోసం కనిపెడుతూ ఉండడం వల్ల పనుల మీద ఏకాగ్రత తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది.
ఛాతీ నొప్పి: అత్యధిక ఒత్తిడి గుండె మీద ప్రభావాన్ని కనబరుస్తుంది. కండరాలు బిగుసుకుంటాయి. శ్వాస తగ్గుతుంది. దాంతో ఛాతీ భాగంలో నొప్పి మొదలవుతుంది.
కంటి చూపు: ఒత్తిడితో కంటి కండరాలు కూడా కుంచించుకుపోతాయి. ఆ కండరాలకు రక్త సరఫరా తగ్గుతుంది. దాంతో కంటి చూపు మసకబారుతుంది.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..