స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత సేపు?
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:31 AM
పైబడే వయసుతో కండర క్షీణత వేధించకుండా ఉండాలన్నా, ఆరోగ్యం భేషుగ్గా ఉండాలన్నా వ్యాయామంలో బరువులను జోడించాలని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే బరువులతో...
పరిశోధన
పైబడే వయసుతో కండర క్షీణత వేధించకుండా ఉండాలన్నా, ఆరోగ్యం భేషుగ్గా ఉండాలన్నా వ్యాయామంలో బరువులను జోడించాలని వైద్యులు చెప్తూ ఉంటారు. అయితే బరువులతో కూడిన స్ర్టెంగ్త్ ట్రైనింగ్ ఎంతసేపు చేయాలి? తెలుసుకుందాం!
హార్వర్డ్‌కు చెందిన కొందరు పరిశోధకుల బృందం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ దీర్ఘాయుష్షుకు దోహదపడుతుందని తాజాగా చేపట్టిన ఒక అధ్యయనం ద్వారా నిర్థారించింది. అయితే ఆ వ్యాయమం కోసం ఎంత సమయం వెచ్చించాం అన్న దాని మీదే మరణాలు రేటు ఆధారపడి ఉంటుందని కూడా పరిశోధకుల బృందం పేర్కొంటోంది. వారానికి కనీసం 90 నుంచి 119 నిమిషాల పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌కు కేటాయించగలిగితే, ఆరోగ్యపరమైన కారణాల వల్ల ప్రాణహాని తలెత్తే అవకాశాలు క్షీణిస్తాయని కూడా అంటోంది. అయితే ఏరోబిక్ వ్యాయామాలూ కూడా కీలకమే! క్రమం తప్పని ఏరోబిక్ యాక్టివిటీకి, క్రమం తప్పని స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ను జోడించినప్పుడు ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటున్నట్టు పరిశోధకులు గమనించారు. కాబట్టి క్రమం తప్పకుండా నడిచే అలవాటున్నవాళ్లు, వారంలో మూడు రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ను కూడా కొనసాగించాలి.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!