50ల్లో బరువులెత్తాలి
ABN , Publish Date - Mar 03 , 2026 | 01:11 AM
యాభై ఏళ్లు దాటినవాళ్లు వ్యాయామం కోసం నడకనే ఎంచుకుంటూ ఉంటారు. కానీ ‘సార్కోపీనియా’ అనే కండర నష్టాన్ని నివారించడం కోసం గుండె వేగాన్ని పెంచే కార్డియోకు తోడుగా, రెసిస్టెన్స్ ట్రైనింగ్...
ఫిట్‌నెస్
యాభై ఏళ్లు దాటినవాళ్లు వ్యాయామం కోసం నడకనే ఎంచుకుంటూ ఉంటారు. కానీ ‘సార్కోపీనియా’ అనే కండర నష్టాన్ని నివారించడం కోసం గుండె వేగాన్ని పెంచే కార్డియోకు తోడుగా, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా కొనసాగించాలి.
30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కర్లో క్రమేపీ కండర నష్టం మొదలవుతుంది. ఈ కండర క్షీణత 50 ఏళ్లకు తీవ్రమవుతుంది. హార్మోన్ల మార్పులు, భౌతిక కదలికలు మందగించడం, పైబడే వయసు.. వీటన్నిటివల్ల, కండర క్షీణత పెరుగుతూ ఉంటుంది. వయసుతో ముడిపడి ఉండే కండర క్షీణత (సార్కోపినియా) దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే కండర ద్రవ్యరాశి కీళ్లకు రక్షణగా మారి, సంతులనాన్ని సమకూర్చి, నడక తడబడకుండా, కింద పడిపోకుండా నియంత్రిస్తుంది. అలాగే మెట్లెక్కేటప్పుడు, సరుకులు, బక్కెట్లు లాంటి బరువులు మోసేటప్పుడు, కుర్చీలో నుంచి పైకి లేచేటప్పుడు శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది.
కండరాలు కొవ్వును కరిగిస్తాయా?
కండర కణజాలం చురుగ్గా ఉంటుంది. కొవ్వుతో పోలిస్తే, కండర కణజాలం విశ్రాంత స్థితిలో కూడా ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అయితే ఈ ప్రయోజనం పొందడానికి సరైన పోషకాహారం తీసుకోవడం కూడా అవసరమే! బరువులతో కూడిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. దాంతో శరీరం గ్లూకోజ్‌ను కొవ్వు రూపంలో నిల్వ చేసుకోకుండా, సమర్థంగా ఉపయోగించుకోగలుగుతుంది.
కండర నష్టంతో ఒరిగే నష్టం
పైబడే వయసులో ఆహారపుటలవాట్లు మారకపోయినా కొందరు బరువు కోల్పోతూ ఉంటారు. దీనికి కారణం కండర నష్టమే! దాంతో శరీరం శక్తిని ఖర్చు చేసే వేగం కూడా తగ్గిపోతుంది. శరీరం విశ్రాంత స్థితిలో తక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తూ, తేలికగా బరువు పెరుగుతుంది. కండర సాంద్రత తగ్గినప్పుడు, నిస్సత్తువ, బలహీనత వేధిస్తాయి.
కాబట్టి 50 ఏళ్ల వయసులో వ్యాయామాన్ని నడకకే పరిమితం చేయకూడదు. బరువులతో వ్యాయామాలు మొదలుపెట్టాలి. దాంతో శరీర పటుత్వం పెరుగుతుంది. మెటబాలిజం ఊపందుకుంటుంది. ప్రత్యేకించి మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తూ ఉండాలి.
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు