Share News

స్టీల్‌ పంపులపై మరకలా...

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:14 AM

వంటగది సింక్‌, వాష్‌బేసిన్‌, బాత్రూమ్‌లలో రోజూ వాడే స్టీల్‌ పంపులపై తెల్లటి మరకలు ఏర్పడడంతోపాటు వాటి చుట్టూ గార పేరుకుపోతూ ఉంటుంది. వీటిని సులువుగా తొలగించే ఇంటి చిట్కాలివే...

స్టీల్‌ పంపులపై మరకలా...

వంటగది సింక్‌, వాష్‌బేసిన్‌, బాత్రూమ్‌లలో రోజూ వాడే స్టీల్‌ పంపులపై తెల్లటి మరకలు ఏర్పడడంతోపాటు వాటి చుట్టూ గార పేరుకుపోతూ ఉంటుంది. వీటిని సులువుగా తొలగించే ఇంటి చిట్కాలివే...

  • పలుచని చేతి రుమాలు లేదా పేపర్‌ టిష్యూని వెనిగర్‌తో తడిపి పంపుకు చుట్టాలి. పావు గంట తరువాత మెత్తటి స్పాంజ్‌తో పంపును మృదువుగా రుద్దాలి. ఆపైన మంచినీటితో కడిగి పొడి గుడ్డతో తుడిచేస్తే స్టీల్‌ పంపు తళతళలాడుతుంది.

  • గిన్నెలో రెండు చెంచాల బేకింగ్‌ సోడాను తీసుకుని కొద్దిగా నిమ్మరసం లేదా తగినన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. దీన్ని పంపుకు రాసి పది నిమిషాలు నాననివ్వాలి. ఆపైన స్పాంజ్‌తో రుద్ది మంచినీటితో కడిగితే సరిపోతుంది.

  • పంపు చుట్టూ ఉండే చిన్న ఖాళీలు, జాయింట్లలో బేకింగ్‌ సోడా పేస్టును రాసి పావుగంటసేపు ఉంచాలి. తరువాత పాత టూత్‌బ్రష్‌తో రుద్ది మంచినీటితో శుభ్రం చేయాలి. ఆపైన పొడి గుడ్డతో తుడిచేస్తే మురికి, గార వదిలి స్టీల్‌ పంపు కొత్తగా కనిపిస్తుంది.

  • స్టీల్‌ పంపుపై తెల్లటి టూత్‌పేస్టును రాసి అయిదు నిమిషాలు ఉంచాలి. ఆపైన నీటిని చల్లుకుంటూ ప్లాస్టిక్‌ స్క్రబ్బర్‌తో రుద్ది కడిగితే మరకలన్నీ వదిలిపోతాయి.

  • అల్యూమినియం ఫాయిల్‌ను చేత్తో నలిపి చిన్న ఉండలా చేయాలి. దీన్ని నీటిలో ముంచి పంపుపై మెల్లగా రుద్ది కడిగితే తేలికపాటి మరకలన్నీ మాయమవుతాయి.

  • వారానికోసారన్నా పంపులను ఇలా శుభ్రం చేస్తుంటే మరకలు ఎక్కువగా పేరుకోవు.

ఇవి కూడా చదవండి..

భారత స్టాక్ మార్కెట్‌కు షాక్.. సెప్టెంబర్‌లో రూ.35,860 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు..

బిహార్ వరద బాధితులకు సహాయం.. తలపై ప్యాకెట్ పడి వ్యక్తి మృతి..

Updated Date - Oct 05 , 2026 | 05:14 AM