Share News

స్టీల్‌ సింక్‌ మెరిసేలా...

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:44 AM

వంటగదిలో ఉండే స్టీల్‌ సింక్‌ వాడుతున్న కొద్దీ తెల్లటి నీటి మరకలతో మెరుపును కోల్పోయి పాతగా మారిపోతుంటుంది. అలాకాకుండా సింక్‌ ఎప్పుడూ కొత్తగా మెరుస్తుండాలంటే...

స్టీల్‌ సింక్‌ మెరిసేలా...

వంటగదిలో ఉండే స్టీల్‌ సింక్‌ వాడుతున్న కొద్దీ తెల్లటి నీటి మరకలతో మెరుపును కోల్పోయి పాతగా మారిపోతుంటుంది. అలాకాకుండా సింక్‌ ఎప్పుడూ కొత్తగా మెరుస్తుండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో చూద్దాం...

  • రోజూ రాత్రిపూట వంట పాత్రలన్నీ కడిగిన తరువాత సింక్‌లో కొద్దిగా డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ వేసి మెత్తటి స్పాంజ్‌తో రుద్ది గోరువెచ్చటి నీటితో కడగాలి. ఆపైన పలుచని గుడ్డతో తడిలేకుండా తుడిచేస్తే సింక్‌ ఎంతకాలమైనా తళతళా మెరుస్తుంటుంది.

  • సింక్‌ను పొడిగా తుడిచిన తరువాత ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరినూనె చుక్క వేసిన దూదితో రుద్దాలి. దీంతో వాటర్‌ ప్రూఫ్‌ లేయర్‌ ఏర్పడి సింక్‌ పాడవకుండా ఉంటుంది.

  • పొడిగా ఆరిన సింక్‌లో కొద్దిగా మైదా లేదా గోధుమపిండి చల్లి పలుచని గుడ్డతో తుడిచేస్తే అద్దంలా మెరుస్తుంది.

  • రెండు రోజులకోసారి తడి సింక్‌లో బేకింగ్‌ పౌడర్‌ చల్లి అయిదు నిమిషాల తరువాత పాత టూత్‌బ్ర్‌షతో రుద్ది కడిగితే మొండి మరకలు, దుర్వాసన తొలగిపోతాయి.

Also Read:

మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు

శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు

Updated Date - Aug 05 , 2026 | 01:44 AM