Share News

ఇంటి పనులతో ఫిట్‌గా...

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:51 AM

శరీరం ఫిట్‌గా ఉండడం కోసం ఖరీదైన జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఫిట్‌నెస్‌ సాధించవచ్చు....

ఇంటి పనులతో ఫిట్‌గా...

శరీరం ఫిట్‌గా ఉండడం కోసం ఖరీదైన జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఫిట్‌నెస్‌ సాధించవచ్చు. ఎలాగంటే...

  • రోజూ గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ శరీరానికి వ్యాయామాన్ని అందిస్తాయి. పండుగలప్పుడు, పిల్లల పుట్టినరోజు లేదా ఏమైనా శుభకార్యాల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇంటిని శుభ్రం చేయడం, బూజులు దులపడం, సామాన్లు సర్దడం తదితర పనులు చేస్తుంటాం. వీటన్నింటినీ భారంగా అనుకోకుండా ఉత్సాహంగా చేస్తే శరీరానికి మంచి వ్యాయామం అందుతుంది.

  • రోజూ ఇల్లు వాకిలి ఊడవడం, వంగి ముగ్గు పెట్టడం, ఇల్లు తుడవడం, షెల్ఫ్‌లు సర్దడం లాంటి పనుల వల్ల భుజాలు, చేతులు, కాళ్లలో కదలికలు పెరిగి కండరాలు బలోపేతమవుతాయి. ఎక్కువసేపు నిలబడి లేదా అటూ ఇటూ తిరుగుతూ పనిచేయడం వల్ల వ్యాయామం చేసిన ఫలితం లభిస్తుంది. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు రావు.

  • ఇంటి పనుల్లో భాగంగా నీళ్ల బకెట్లు లేదా బిందెలు మోయడం, సామాన్లను ఒకవైపునుంచి మరోవైపునకు మార్చడం లాంటివి చేసినప్పుడు శరీర భాగాల్లో సహజమైన కదలికలు ఏర్పడుతుంటాయి. వీటివల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో అనవసరమైన కొవ్వులు పేరుకోవు.

  • వాషింగ్‌ మెషిన్‌పై ఆధారపడకుండా వారానికోసారి బట్టలను చేత్తో ఉతికి ఆరేస్తే శరీరంలో పేరుకున్న అనవసరమైన క్యాలరీలు కరిగిపోతాయి. పొట్ట కండరాలకు వ్యాయామం అందుతుంది.

  • బట్టలను ఇంట్లోనే ఇస్త్రీ చేసుకుంటే చేతులు, కాళ్లు, పొట్ట, వెన్నెముకల్లోని కండరాలకు బలం చేకూరుతుంది. ఏకాగ్రతతో పనిచేయడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది.

  • సంగీతం లేదా పాటలు వింటూ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలసట, నీరసం ఆవహించవు. ఈ టెక్నిక్‌తో ఎప్పుడూ ఉత్సాహంగా, ఫిట్‌గా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 01:51 AM