Share News

కుంకుడు రసంతో ఇలా...

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:40 AM

కుంకుడుకాయల్లో ఉండే ‘సెపోనిన్‌’ అనే మూలకం మలినాలను తొలగించడానికి తోడ్పడుతుంది. కేవలం శిరోజాలను శుభ్రం...

కుంకుడు రసంతో ఇలా...

కుంకుడుకాయల్లో ఉండే ‘సెపోనిన్‌’ అనే మూలకం మలినాలను తొలగించడానికి తోడ్పడుతుంది. కేవలం శిరోజాలను శుభ్రం చేసుకోవడానికే కాకుండా కుంకుడుకాయల రసాన్ని ఏవిధంగా వినియోగించుకోవచ్చో చూద్దాం...

ఫ గ్లాసు నీటిలో నాలుగు కుంకుడుకాయలు వేసి బాగా ఉడికించాలి. ఇది చల్లారిన తరువాత చేత్తో గట్టిగా ఒత్తి రసాన్ని గాజు సీసాలోకి వడబోయాలి. అందులో అయిదు చుక్కల అరోమా ఆయిల్‌ వేసి కలపాలి. గట్టిగా మూత బిగించి ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి. రోజూ స్నానానికి వెళ్లేటప్పుడు చిన్న గిన్నెలో కొద్దిగా కుంకుడు రసాన్ని తీసుకుని సబ్బు లేదా బాడీ వాష్‌కు బదులుగా ఉపయోగించుకోవచ్చు.

ఫ వెడల్పాటి గిన్నెలో గుప్పెడు కుంకుడుకాయలు వేసి ఓ పూటంతా నానబెట్టాలి. ఆపైన వాటి నుంచి రసాన్ని తీసి అర బకెట్‌ నీటిలో కలపాలి. ఈ మిశ్రమంతో పట్టు చీరలు, జరీ అంచు పంచెలను సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. సున్నితంగా ఉండే లెహంగాలు, చున్నీలు, ఇతర డ్రెస్‌లను కూడా బేబీ షాంపూకు బదులు ఈ కుంకుడు రసంతో వాష్‌ చేయవచ్చు. తేలికపాటి మరకలు, జిడ్డు పూర్తిగా వదిలిపోతాయి.

ఫ గిన్నెలో సగానికిపైగా కుంకుడుకాయల రసాన్ని తీసుకుని అందులో బంగారు, వెండి ఆభరణాలు వేసి పావుగంటసేపు నానబెట్టాలి. తరువాత పాత టూత్‌బ్ర్‌షతో సున్నితంగా రుద్ది మంచినీటితో కడిగేస్తే నగలు కొత్తవాటిలా మెరుస్తాయి.రత్నాలు, మెరిసే రాళ్లు, పూసలు ఉన్న నగలను ఎక్కువసేపు నానబెట్టకూడదు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 05:40 AM