ఏసీ నీళ్లతో ఇలా
ABN , Publish Date - May 18 , 2026 | 05:06 AM
ఇంట్లో ఏసీని వాడేటప్పుడు దాని అవుట్‌లెట్ నుంచి బకెట్ల కొద్దీ నీరు బయటికి వస్తుంటుంది. ఈ కండెన్సేట్ నీటిని వృథా చేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...
ఇంట్లో ఏసీని వాడేటప్పుడు దాని అవుట్‌లెట్ నుంచి బకెట్ల కొద్దీ నీరు బయటికి వస్తుంటుంది. ఈ కండెన్సేట్ నీటిని వృథా చేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...
ఏసీ నుంచి వచ్చే నీటిని బకెట్లో సేకరించి ఇల్లు తుడవడానికి ఉపయోగించుకోవచ్చు. మేడ మెట్లు, సింక్‌లు, బాల్కనీ, బాత్‌రూమ్ కడగడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.
ఏసీ నీటిని మొక్కలకు పోయవచ్చు. ఈ నీటిలో మినరల్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ మొక్కలు ఎక్కువసేపు తాజాగా ఉండడమే కాకుండా బలంగా ఏపుగా పెరుగుతాయి కూడా. ఈ నీరు వర్షపు నీటిని పోలి ఉంటుంది. ఇందులో క్లోరిన్ ఉండదు. ఇండోర్ ప్లాంట్స్‌కు పోస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.
డ్రెస్సింగ్ మిర్రర్, కిటికీల అద్దాలు, కారు, బైక్‌లను శుభ్రం చేసుకోవచ్చు. నీటి మరకలు, మబ్బులా మసకబారడం లాంటివి లేకుండా వాటికి చక్కటి మెరుపుదనం వస్తుంది.
అంతగా మురికి లేని బట్టలను ఏసీ నీటితో ఉతకవచ్చు.
ఏసీ నీటిని స్టీమ్ ఐరన్ బాక్స్‌లో వాడుకోవచ్చు. ఈ నీటి వల్ల ఐరన్ బాక్స్ లోపల ఎలాంటి మలినాలు పేరుకోవు కాబట్టి అది ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. కార్ రేడియేటర్లో కూడా పోయవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్ కంపెనీగా టీసీఎస్
బంగారంలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్, ఈజీఆర్‌లు